Saripodhaa Sanivaaram : పది రోజుల ముందే అక్కడ రచ్చ.. నాని క్రేజ్ కి నిదర్శనం..

Saripodhaa Sanivaaram : టాలీవుడ్ లో పంద్రాగస్టు సినిమాల హడావుడి అయిపోయింది. ఆ సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో వీకెండ్ కూడా పూర్తి కాకుండా థియేటర్లో జనాలు లేని పరిస్థితి. ఇక ఇప్పుడు జనాల దృష్టి అంతా ‘సరిపోదా శనివారం’ సినిమాపైనే ఉంది. నాని కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంటే సుందరానికి తర్వాత నాని – వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ సినిమా ప్లాప్ అయినా, రిలీజ్ తర్వాత అండర్రేటెడ్ క్లాసిక్ గా నిలిచింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ‘స‌రిపోదా శ‌నివారం’ ట్రైలర్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకోగా, చిత్ర యూనిట్ అన్ని భాషల్లో కూడా వరుస ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.

Saripodhaa Sanivaaram bookings crossed 50k dollars overseas

అక్కడ అప్పుడే రచ్చ మొదలైంది…

ఇదిలా ఉండగా సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమా రిలీజ్ కి ఇంకా పది రోజుల సమయం ఉంది. కానీ అప్పుడే ఈ సినిమా రచ్చ ఓవర్సీస్ లో మొదలైంది. అవును… ఓవర్సీస్ లో రెండు వారాల ముందే బుకింగ్స్ ఓపెన్ అవగా అప్పుడే బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఓవర్సీస్ లో రిలీజ్ కి ఇంకా పది రోజులుండగా, అప్పుడే బుకింగ్స్ తో 50k డాలర్లు దాటేసింది. నాని కెరీర్ లో అత్యంత వేగంగా బుకింగ్స్ జరుగుతున్న సినిమా ఇదేనని చెప్పాలి. రెండు రోజుల్లో 100k దాటడం ఖాయం. ఇక సరిపోదా శనివారం ఓవర్సీస్ లో ప్రీమియర్స్ కే 500k డాలర్లు వసూలు చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -

నాని క్రేజ్ కిది నిదర్శనం…

ఇక నాని (Nani) సినిమాలకు ఓవర్సీస్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఓవర్సీస్ లో అత్యధికంగా 1 మిలియన్ డాలర్లున్న మీడియం స్టార్ హీరో నాని. స్టార్ హీరోల లెవెల్లో ఓవర్సీస్ లో నాని సినిమాకి కలెక్షన్లు వస్తూ ఉంటాయి. ఇక సరిపోదా శనివారం ఓవర్సీస్ బుకింగ్స్ తోనే నాని క్రేజ్ ఏంటో తెలిసిపోతుంది. ఇక మీడియం రేంజ్ స్టార్ హీరోల్లో ఇప్పటికీ టాప్ లో ఉన్న నాని, ఈ సినిమాతో మరింత ఎదిగిపోతాడని చెప్పాలి. దసరా సినిమాతో ఆల్రెడీ వంద కోట్ల గ్రాస్ కొల్లగొడితే, ఈ సారి సరిపోదాశనివారం సినిమాతో 100 కోట్ల షేర్ ని కొల్లగొట్టడం ఖాయమని నాని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమాకి ఆల్రెడీ తమిళ్ లో ప్రమోషన్లు స్టార్ట్ చేయగా, త్వరలో హిందీలో కూడా మొదలు పెట్టనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు