Nayanatara: ఆ టార్చర్ తట్టుకోలేక ప్రభుదేవాతో నయనతార బ్రేకప్..!

Nayanatara.. సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ అంటే కచ్చితంగా గుర్తుకు వచ్చే పేరు నయనతార. తెలుగు, తమిళ్ , కన్నడ, హిందీ వంటి భాషలలో కూడా నటిస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ముఖ్యంగా తమిళనాడులో ఈమె క్రేజ్ చూస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు. స్టార్ హీరోలకు సమానంగానే క్రేజ్ ను సంపాదించుకుంది. అందుకే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. ఎన్నో రకాల లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించింది నయనతార. ఇకపోతే ఈమె తన అభిమాని, ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. అంతేకాకుండా వీరికి సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలు కూడా జన్మించారు

Nayanatara: Unable to bear the torture, Nayanatara broke up with Prabhudeva..!
Nayanatara: Unable to bear the torture, Nayanatara broke up with Prabhudeva..!

ప్రభుదేవాతో ప్రేమాయణం..

నయనతార వివాహాని కంటే ముందు హీరో శింబు పాటు, డైరెక్టర్ కం నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో కూడా ప్రేమాయణం నడిపింది. ప్రభుదేవాతో ప్రేమాయణం పెళ్లి వరకు తీసుకువచ్చింది నయనతార. కానీ అనుకోకుండా వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రభుదేవా కి నయనతార తో కంటే ముందుగానే పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నయనతార తో పెళ్లి కోసం, తన భార్య రమాలత తో విడాకులు కూడా తీసుకున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. కట్టుకున్న భార్యకే విడాకులు ఇవ్వాలనుకున్న ప్రభుదేవా నయనతారతో జీవించాలి అనుకున్నారు. కానీ అంతలోనే ఏమైందో తెలియదు కానీ సడన్ గా విడిపోయారు. అలా పెళ్లి కూడా చేసుకోవాలనుకున్న ఈ జంట ఉన్నట్టుండి విడిపోవడానికి గల కారణం ఏంటనే విషయం ఇప్పటికీ అభిమానులకు సందేహంగానే ఉన్నది.

ప్రభుదేవా కండీషన్లకు విసిగిపోయిన నయనతార..

తాజాగా కోలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. నయనతార తో ప్రేమలో ఉన్నప్పుడు ప్రభుదేవా నయనతారకు చాలా కండిషన్లతో టార్చర్ పెట్టేవారట. నయనతార క్రిస్టియన్.. అయినప్పటికీ కూడా ప్రభుదేవా తన మతంలోకి మారాలని అడిగేవారట .అలాగే వివాహం తర్వాత సినిమాలు మానేసి కేవలం ఇంటి దగ్గరే ఉండిపోవాలని కండిషన్ ని కూడా పెట్టారట. అయితే వీటన్నిటికీ కూడా ఒప్పుకున్న నయనతార కానీ చివరికి తన మొదటి భార్య పిల్లలను కూడా తనతో పాటే ఉంటారని కండిషన్ చెప్పడంతో నయనతార వీటన్నిటికీ విసిగిపోయిందట.

- Advertisement -

టార్చర్ భరించలేక బ్రేకప్..

దీంతో పెళ్లికి ముందే ప్రభుదేవా ఇలాంటి కండిషన్ల పెట్టారంటే..వివాహం తర్వాత తన పరిస్థితి ఎలా ఉంటుందో ముందే ఊహించుకున్న నయనతార వెంటనే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశాన్ని కూడా విరమించుకుందట. అలా ప్రభుదేవా, నయనతార మధ్య బ్రేకప్ జరిగిందని సమాచారం.

ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ తో ప్రేమ, పెళ్లి..

అలా కొన్నేళ్ల తర్వాత ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో మళ్లీ నయనతార ప్రేమలో పడడంతో పాటు కొన్నేళ్లపాటు రిలేషన్షిప్ లో ఉన్నారట. అంతేకాకుండా నయనతార కు ఉన్న ఇబ్బందులను వివరించి, చివరికి అన్నిటికీ ఓకే చెప్పిన తర్వాతే డైరెక్టర్ ని వివాహం చేసుకున్నదట. ప్రస్తుతమైతే నయనతార తమ కుటుంబంతో కలిసి మంచి లైఫ్ ను లీడ్ చేస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు