Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 లోకి హీరో ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర టాప్ రియాలిటీ బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టీవీ షో మరో రెండు వారాల్లో మొదలు కాబోతోంది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లబోయే సెలబ్రిటీలు, కామన్ మ్యాన్స్‌ సెలక్షన్స్, ఆడిషన్స్ అన్నీ జరిగిపోయాయి. అయితే ఈ షోలో కంటెస్టెంట్స్ గా ఎవరు రాబోతున్నారు అనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. సెప్టెంబర్ 1 నుంచి మొదలయ్యే బిగ్ బాస్ టీవీ షో కోసం ఇప్పటి నుంచే వర్కవుట్లు, క్యాంపెయిన్లు, ప్రణాళికలు, ఆర్మీలను ఏర్పాటు చేసుకోవడానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు కంటెస్టెంట్లు..ఇక ఈ షోలోకి ఓ హీరో రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈయన కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. రీసెంట్ గా మస్త్ షెడ్స్ ఉన్నాయి రా సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అభినవ్ గోమటం. కామెడీ తో పాటు సెటైరికల్ డైలాగ్స్ వేయడంలో అభినవ్ దిట్ట. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌లో అతను పండించిన కామెడీకి అందరూ కడుపుబ్బా నవ్వుకున్నారు. అలాగే పలు సినీల్లోనూ మెరిశాడు. ఈక్రమంలోనే అభినవ్ కు ఉన్న క్రేజ్, పాపులారిటీ దృష్ట్యా బిగ్ బాస్ టీమ్ అతనిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఒక వేళ అతను హౌస్‌లోకి వస్తే ఎంటర్ టైన్మెంట్ డబుల్ అవ్వడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందని సమాచారం.

tollywood young Hero entry in Bigg Boss 8..
tollywood young Hero entry in Bigg Boss 8..

ఇకపోతే గతంలో ఈ షో ఆగస్టు లో ప్రారంభం అయ్యింది. కానీ ఈ ఏడాది మాత్రం ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. సెప్టెంబర్ నెల నుంచి బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత దాదాపు 106 రోజులు వారికి ఎంటర్ టైన్మెంట్ కి దిగులు ఉండదు. ఇప్పుడు కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కూడా సెప్టెంబర్ నెల నుంచే ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే రెండు ప్రోమోలు కూడా రిలీజ్ చేశారు. ఎంటర్ టైన్మెంట్ కి లిమిటే లేదు అంటూ హామీ ఇస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.. ఇక ఈ షోకు ఎలాంటి టాక్ వస్తుందో ఎన్ని కాంట్రవర్సీలు అవుతాయో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు