Rhea Chakraborty.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి తూనీగా తూనీగా సినిమాతో అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న ప్రముఖ హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ సినిమా తర్వాత మళ్లీ ఆమె తెలుగు ఇండస్ట్రీలో కనిపించలేదు చేసినవి తక్కువ సినిమాలు అయినా సోషల్ మీడియాలో భారీగా పాపులారిటీ సొంతం చేసుకుంది. హీరో సుశాంత్ సింగ్ రాజు పుత్ తో ప్రేమ వ్యవహారం నడిపిన ఈమె ఆ తర్వాత సుశాంత్ సూసైడ్ చేసుకొని చనిపోవడంతో అతడి మరణంలో రియా చక్రవర్తి పేరు ప్రధమంగా వినిపించింది. దీంతో నెట్టింట ట్రోల్స్ కూడా ఎదుర్కొంది ఈ ముద్దుగుమ్మ.
అప్పటి నుంచి ఏదో ఒక ఇష్యూ తో వార్తల్లో నిలుస్తున్న ఈమె ఇప్పుడు మరొకసారి వార్తల్లో నిలిచింది. ఒక యంగ్ బిజినెస్ మాన్ తో ముంబై రోడ్లపై షికారులు చేస్తూ మీడియా కంట పడింది రియా చక్రవర్తి. తాజాగా బాయ్ ఫ్రెండ్ తో ఇలా బైక్ రైడింగ్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఇతడు ఎవరో కాదు జిరోదా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్. గత కొంతకాలంగా ఇతడితో ఎఫైర్ పెట్టుకున్న ఈమె ముంబై రోడ్లపై బైకు మీద షికారులు చేస్తూ కనిపించింది .నిఖిల్ హెల్మెట్ ధరించగా , మాస్క్ పెట్టుకొని దర్శనమిచ్చింది రియా. ప్రస్తుతం వీరికి సంబంధించి సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ అభిమానులు మండిపడుతున్నారు. బాయ్‌ఫ్రెండ్ మరణించినా ఈమె అప్పుడే ఇంకొకడిని చూసుకుంది అంటూ ఈమెపై పూర్తిస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.
రియా చక్రవర్తి కెరియర్..
రియా చక్రవర్తి కెరియర్ విషయానికి వస్తే, కర్ణాటకలోని బెంగళూరులో బెంగాలీ కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి ఆర్మీ ఆఫీసర్. ఈ నేపథ్యంలోనే ఈమె ఆర్మీ పబ్లిక్ స్కూల్ అంబాలా కాంట్ , అంబాలా, అగ్ర లో ఉన్న సెయింట్ క్లేర్స్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. వీజే గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె హిందీ చిత్రాలలో ఎక్కువగా కనిపించింది. MTV ఇండియాలో వీ జే గా తన వృత్తిని ప్రారంభించిన రియా చక్రవర్తి, 2012లో వచ్చిన తూనీగా తూనీగా సినిమాతో నటన రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 2013లో వచ్చిన మేరే డాడ్ కి మారుతి సినిమాలో కనిపించింది.
వ్యక్తిగత జీవితం..
గతంలో నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో డేటింగ్ చేసిన ఈమె, 2019 సెప్టెంబర్ లో తన సోదరుడు అలాగే రాజ్ పుత్ తో కలిసి వివిడ్రేజ్ రియాలిస్టిక్ అనే కృత్రిమ మేధస్సు సంస్థను స్థాపించింది. అయితే 2020 జూన్ 14వ తేదీన రాజ్‌పుత్ ముంబైలోని బాంద్రాలో తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నారు .ఈయన మరణించిన ఆరు రోజుల తర్వాత ఆమె పేరు బయటకు వచ్చింది. ఇక ఈ కేసులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది అంతే కాదు ఈమెను పోలీసులు అరెస్టు చేశారు కూడా. ఇక ఇప్పుడు కొత్త బాయ్ ఫ్రెండ్ తో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది రియా చక్రవర్తి .