Imanvi : సినిమా రిలీజ్ కి ముందే అటెన్షన్ గ్రాబ్ చేసింది, మన తెలుగు అభిమానులు అంతే

Imanvi : తెలుగు ప్రేక్షకులకు సినిమా మీద ఉన్నంత అభిమానం మరో ఇండస్ట్రీ ప్రేక్షకులకు ఉండదు అనేది వాస్తవం. ఒక సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగతా ఇండస్ట్రీలోనూ చాలా మంది స్టార్ హీరోస్ కూడా తెలుగు ప్రేక్షకులు అంటే తమకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెబుతూ ఉంటారు. ఒక సినిమాకు సంబంధించి ఒక కొత్త నటి ఎంట్రీ ఇస్తుంది అని అంటే తన గురించి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. తెలుగు ప్రేక్షకులు వెంటవెంటనే న్యూ క్రష్ అంటూ స్టేటస్ లు కూడా పెడుతూ ఉంటారు.

ప్రస్తుతం హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ప్రభాస్ ఒక పిరియాడిక్ ఫిలిం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఇమాన్వి అనే అమ్మాయి తెలుగు సినిమాకి పరిచయం కానుంది. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం నిన్ననే మొదలైంది. ఈ పూజా కార్యక్రమంలో ఇమాన్వి అందరిని ఆకర్షించింది అని చెప్పాలి. అసలు ఇంతకీ ఎవరు ఈ ఇమాన్వి అంటూ అందరూ ఎంక్వయిరీలు మొదలుపెట్టారు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె పెట్టిన రీల్స్ అన్నిటిని కూడా షేర్లు చేయటం మొదలుపెట్టారు. కొంతమంది న్యూ క్రష్ అంటూ స్టేటస్లు కూడా పెట్టారు.

Prabhas

- Advertisement -

ఇక ఇమాన్వి విషయానికొస్తే కేవలం దాదాపు 24 గంటల కాల వ్యవధిలో 60 వేల మంది ఫాలోవర్స్ వచ్చారు. సినిమా రిలీజ్ అవ్వకముందే తన గురించి అందరూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ట్విట్టర్లో ఇమాన్వి(imanvi ismail) వీడియోలు ట్రెండింగ్ అవుతున్నాయి. అంతేకాకుండా దర్శకుడు హను పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి సినిమాకు ఇంత మంచి హీరోయిన్స్ ను ఎలా పట్టుకుంటావు అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు