Saripodha Sanivaram: చెన్నైలో నానికి సర్ప్రైజ్ ఇచ్చిన కీర్తి సురేష్ అసలు ఏం చేసిందో తెలుసా.?

Saripodha Sanivaram: వివేక్ ఆత్రేయ నాని కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన సినిమా అంటే సుందరానికి(Ante Sundaraniki). ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందన అందుకొని బిలో యావరేజ్ గా మిగిలింది. అయితే ఈ సినిమాకి ఇప్పటికీ ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పొచ్చు. ఈ సినిమాను విపరీతంగా ఇష్టపడే ఆడియన్స్ ఉన్నారు. ఈ సినిమాలో వివేక్ సుందర్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అలానే లీలా థామస్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం ఇవన్నీ కూడా చాలామంది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

వీటన్నిటిని మించి అంటే సుందరానికి సినిమాలో వివేక్ సాగర్(Vivek Sagar) అందించిన మ్యూజిక్ అద్భుతం అని చెప్పొచ్చు. సినిమాకి మంచి సాంగ్స్ తో పాటు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వివేక్ అందించాడు. అయితే ఎంతో నమ్మకంతో చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలింది. అందుకే ప్రస్తుతం నానితో చేస్తున్న సినిమాని యాక్షన్ జోనర్ లో తీయడం మొదలుపెట్టాడు వివేక్. ఈ సినిమాకి సరిపోదా శనివారం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

ఈ సినిమాను ఆగస్టు 29న అధికారికంగా రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు నాని. సినిమాకు సంబంధించిన తమిళ ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తమిళ్లో కూడా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు నాని. కానీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తరుణంలో నానికి కీర్తి సురేష్(Keerthi Suresh) ఫోన్ చేశారు. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ మిమ్మల్ని ఎప్పటినుంచో కలవాలనుకుంటున్నాను మిమ్మల్ని ఎప్పుడు కలవచ్చు అని కీర్తి అడిగినప్పుడు, నేను ఈరోజు చెన్నైలోనే ఉంటాను మీరు ఇప్పుడు కలిసిన పర్వాలేదు అంటూ చెప్పుకొచ్చాడు నాని. ఇలా మాట్లాడుతున్న ప్రాసెస్లో తనతో ఫోన్ కాల్ మాట్లాడుతుంది కీర్తి అని గెస్ చేశాడు నాని. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Saripodhaa Sanivaaram

ఇక దర్శకుడు వివేక ఆత్రేయ(Vivek Sagar) మెంటల్ మదిలో(Mental Madilo) సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు . అయితే మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు వివేక్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ అనిపించింది. అలానే చాలామంది విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత వివేకాత్రేయ దర్శకత్వం వహించిన సినిమా బ్రోచేవారెవరురా. తర్వాత నానితో చేసిన అంటే సుందరానికి సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు మరి ఈ సినిమా ఏ స్థాయిలో ఆడుతుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు