Harish Shankar : త్రివిక్రమ్ పై హరీష్ శంకర్ ఇంత ప్రేమను దాచుకున్నాడా.?

Harish Shankar :ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ రైటర్ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. దర్శకుడుగా త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram) సక్సెస్ఫుల్ అయినా కూడా తనలోని రైటర్ ను మాత్రం త్రివిక్రమ్ లోని దర్శకుడు డామినేట్ చేయలేకపోయాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన నువ్వే నువ్వే సినిమా తర్వాత అతడు సినిమాతో తనలోని దర్శకుడును కంప్లీట్ గా బయటకు తీసే ప్రయత్నం చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కానీ అతడు సినిమాలో కూడా అద్భుతమైన డైలాగ్స్ ప్రతిచోట వినిపిస్తూనే ఉంటాయి. అతడు(Athadu) సినిమాలో ఎంత మంచి యాక్షన్ సీక్వెన్సెస్ , ఎమోషనల్ సీన్స్ వచ్చినా కూడా “నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం” “మర్చిపోవడానికి అది జ్ఞాపకం కాదు, జీవితం”వంటి డైలాగ్స్ త్రివిక్రంలోని దర్శకుడుని డామినేట్ చేశాయని ఒప్పుకొని తీరాల్సిందే.

రైటర్ డామినేషన్

ఇకపోతే యాక్షన్ సీక్వెన్సెస్ ను, ఎమోషనల్ సీన్స్ ను, మాస్ డాన్స్ బీట్స్ ను ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారో, అలాగే డైలాగ్స్ ని ఇష్టపడిన వాళ్లు కూడా ఉంటారు అని చెప్పాలి. అలాంటి వారిలో ప్రేక్షకులు మాత్రమే కాకుండా సినిమా దర్శకులు కూడా ఉన్నారు. అలా హరీష్ శంకర్ విషయానికొస్తే త్రివిక్రమ్ డైలాగ్స్ కి ఎంత పెద్ద అభిమాని అని చాలాసార్లు చెబుతూ వచ్చాడు. హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమా తీసిన తర్వాత కూడా త్రివిక్రమ్ దానిపై స్పందిస్తూ.. “హరీష్ చాలా బాగా రాశాడు అలానే చాలా బాగా తీశాడు అంటూ చెప్పుకొచ్చాడు” దీనికి ప్రతిస్పందనగా హరీష్ శంకర్(Harish Shankar) మాట్లాడుతూ.. ” త్రివిక్రమ్ గారు నా సినిమా డైలాగ్స్ గురించి మాట్లాడటం అనేది చాలా ఆనందంగా అనిపించింది” అంటూ చెబుతూ వచ్చాడు. సినిమాలను ఫాలో అయ్యే వాళ్ళకి దర్శకులను ఇష్టపడే వాళ్ళకి ఈ మాటలు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇవి గుర్తుండే ఉంటాయి.

Gabbar Singh

- Advertisement -

హరీష్ – త్రివిక్రమ్ మధ్య విబేధాలు

ఇక రీసెంట్ టైమ్స్ లో హరీష్ శంకర్, త్రివిక్రమ్ కి మధ్య చాలా విభేదాలు వచ్చాయి అని కథనాలు వినిపించాయి. వీటికి కారణాలుగా చెబుతూ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి బాగా క్లోజ్ గా ఉండటం వలన, పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ చెప్పిన మాటలను, త్రివిక్రమ్ చెప్పిన ప్రాజెక్టులను మాత్రమే ముందు ఫినిష్ చేస్తున్నాడు అంటూ కథనాలు వినిపించాయి. ఈ ప్రాసెస్ లో హరీష్ ఊస్తాద్ భగత్ సింగ్ సినిమా లేట్ అవుతుంది అని కొంతమంది రాసుకుంటూ వచ్చారు. అలానే మైత్రి మూవీ మేకర్స్ కి, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ కి కూడా కొన్ని విభేదాలు ఉన్నట్లు కథనాలు వినిపించాయి. ఇక పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హరీష్ కాంబినేషన్లో వచ్చే సినిమాను మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) సంస్థ నిర్మిస్తోంది. అయితే వీటన్నిటికీ హరీష్ శంకర్ నేడు పుల్ స్టాప్ పెట్టాడు.

 

Ustaad Bhagat Singh

హరీష్ శంకర్ క్లారిటీ

ఇదే ప్రశ్నను ఒక వ్యక్తి అడగగా, హరీష్ శంకర్ చాలా ఆసక్తికర విషయాలను త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చెబుతూ వచ్చాడు. హరీష్ శంకర్ తన పదునైన మాటలతో అవతలవాడిని ఈజీగా ఆకర్షిస్తాడు. తన సినిమాలోని డైలాగ్స్ కూడా అలానే ఉంటాయి. ఇంక హరీష్ శంకర్ స్పీచెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్ లో “నింగి ,నేల, నీరు ,నిప్పు ,గాలి లానే పవర్ స్టార్ క్రేజ్ కూడా శాశ్వతం” చెప్పినప్పుడే గబ్బర్ సింగ్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చాలామందికి ఒక ఊహ వచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అంటే హరీష్ కి ఎంత ఇష్టమో మరోసారి చెప్పాడు. ముళ్ళపూడి వెంకటరమణ వంటి పెద్ద రచయితల పేర్లు కూడా ప్రస్తావిస్తూ త్రివిక్రమ్ మీద ప్రేమను ఒలకపోశాడు.

త్రివిక్రమ్ పై ఉన్న ప్రేమ

వీటన్నిటిని మించి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి హరీష్ శంకర్ నాన్న అతిపెద్ద అభిమాని అంటూ చెప్పుకొచ్చాడు. హరీష్ శంకర్ తన సినిమాలలో ఏదైనా ఒక డైలాగ్ ఓవర్గా రాస్తే, త్రివిక్రమ్ చూడు ఎలా రాస్తున్నారు అంటూ హరీష్ శంకర్ నాన్న చెబుతూ ఉంటారట. త్రివిక్రమ్ శ్రీనివాస్ మా ఇంట్లో ఒక పెద్ద కొడుకు లాంటివారు అంటూ చెప్పుకొచ్చారు. హరీష్ శంకర్ తండ్రికి త్రివిక్రమ్ మీద ఉన్న ప్రేమను చూస్తుంటే, హరీష్ శంకర్ తాను తీసిన సినిమాలను త్రివిక్రమ్ శ్రీనివాస్ తండ్రి దగ్గరికి వెళ్లి మరి చూపించాలి అనుకుంటారట. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అతడు సినిమాని దాదాపు వందల సార్లు హరీష్ శంకర్ ఫాదర్ చూసుంటారట. ఈ విషయాలన్నీటిని స్వయంగా హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు