Bandi Saroj Kumar – Parakramam : ఈ కాన్సప్ట్ ఏదో కొత్తగా అనిపిస్తుంది

Bandi Saroj Kumar – Parakramam : బండి సరోజ్ కుమార్… ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దివంగత జర్నలిస్ట్, నటులు టిఎన్ఆర్ ఇంటర్వ్యూస్ కి ఒకప్పుడు ఏ స్థాయిలో ఆదరణ లభించేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఇంటర్వ్యూస్ అప్పట్లో గంటల వ్యవధిలో మాత్రమే ఉంటే ఈయన ఇంటర్వ్యూస్ మాత్రం మూడు నాలుగు గంటల వ్యవధిని దాటిపోతూ ఉండేవి. నెక్స్ట్ ఏ గెస్ట్ తో ఇంటర్వ్యూ వస్తుందో అని చాలామంది ఎదురుచూస్తూ ఉండేవారు. అప్పుడు సడన్ గా టిఎన్ఆర్ ఇంటర్వ్యూస్ లో ఒక కొత్త ముఖం కనిపించింది.

ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. శింబు(Simbhu), సూర్య(Suriya), విశాల్తో(Vishal) పాటు చాలామంది తెలుగు హీరోల పేర్లు కూడా ఆ ఇంటర్వ్యూలో వినిపించాయి. వీటన్నిటిని మించి “రెండు దశాబ్దాల పాటు గుర్తుండిపోయే రెండు గంటల సినిమా” అంటూ తన సినిమాను ప్రమోట్ చేశాడు దర్శకుడు, నటుడు , ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా దాదాపు 12 క్రాఫ్ట్స్ ను డీల్ చేసిన బండి సరోజ్ కుమార్. ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు చాలామందికి ఆశ్చర్యం కలిగింది. ఆ మాటలను నమ్మాలా వద్దా అని కూడా అనుమానాలు కూడా వచ్చాయి. కానీ కొన్ని రోజుల తర్వాత ప్రముఖ నిర్మాత సురేష్ బాబు బండి సరోజ్ గురించి చెప్పిన మాటలు వింటే అందరూ ఆశ్చర్యపోయారు.

జూనియర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టిన సరోజ్ తనను తాను హీరోను చేసుకోవడానికి కథలు రాయడం మొదలుపెట్టాడు. ఆ కథలు కూడా చందమామ కథలు. తను చదువుకున్న పుస్తకాల్లోంచి ఎక్కడి నుంచో కథలు రాస్తూ ఉండేవాడు. ఆ తర్వాత చాలా చిన్న ఏజ్ లోనే సురేష్ బాబు కి స్టోరీ నేరేషన్ చెప్పాడు. సురేష్ బాబు చెప్పిన కొన్ని మార్పులు చేయకుండా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయి పొరక్కలం అనే ఒక సినిమాను చేశాడు. ఈ సినిమాకి మంచి ప్రశంసలు దక్కాయి. చాలామంది ఆ సినిమాను విజువల్ వండర్ అంటూ ప్రశంసించారు. ప్రస్తుతం ఆ సినిమా గురించి సరోజి మాట్లాడుతూ నేను మెచ్యూరిటీ లేకుండా ఆ సినిమా తీశాను అంటూ చెబుతూ ఉంటాడు. సినిమా అంటే విజువల్ కాదు సినిమా అంటే ఎమోషన్ అంటూ ఒక కొత్త నిర్వచనాన్ని తనకు తాను రియలైజ్ అయ్యాడు.

- Advertisement -

Bandi Saroj Kumar's Parakramam

కల నాది వెలమీది

ఇక సరోజ్ కల నాది వెలమీది అనే కాన్సెప్ట్ తో తన యూట్యూబ్ ఛానల్ లో నిర్బంధం మాంగల్యం వంటి సినిమాలను నిర్మించాడు. వీటికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు సాయి రాజేష్ లాంటి వాళ్లు ఈ సినిమాను పబ్లిక్ గా పోస్ట్ చేసి మరి పొగడటం మొదలుపెట్టారు. ఇకపోతే సరోజ్ చేసిన సూర్యస్తమయం సినిమా థియేటర్స్ కి వచ్చినా కూడా ఆ సినిమా విషయంలో చాలా రాజకీయాలు జరిగాయి. ఇక ప్రస్తుతం సరోజ్ పరాక్రమం అనే సినిమాతో తెలుగు ప్రాక్షకులు ముందుకి ఆగస్టు 22న రాబోతున్నాడు.

పరాక్రమం సినిమా ఎందుకు చూడాలి

ఇక పరాక్రమం (Parakramam) సినిమా ఎందుకు చూడాలి అనే విషయానికి వస్తే.. సాధారణంగా ప్రతి ఒక్కరికి కొన్ని కలలుంటాయి. ఆ కలలను సాకారం చేసుకునే ప్రాసెస్ లో చాలా సమస్యలు అడ్డు వస్తాయి. ఒక సామాన్యుడు ఏదైనా ఒక కలను సాధించాలి అనుకునే తరుణంలో, తనకున్న కుటుంబ పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, ప్రేమ, మోసపోవడం ఇలాంటి కామన్ గా జరుగుతుంటాయి. ఇలాంటి ఒక క్యారెక్టర్ ను సినిమాటిక్ వే లో పరాక్రమం సినిమాలు చూపించనున్నాడు సరోజ్ కుమార్. ఈ కాన్సెప్ట్ వినగానే చాలామంది ఈజీగా కనెక్ట్ అవుతారు అని చెప్పొచ్చు. ఎందుకంటే అనుకున్నది సాధించిన వాళ్ళ కంటే కూడా కాంప్రమైజ్ అయిపోయిన వల్లే ఎక్కువ మంది ఉన్నారు ఈ సొసైటీలో, సరోజ్ రివీల్ చేసిన ఈ కాన్సెప్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఆగస్టు 22న తెలియనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు