Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సినిమా ఏదో తెలుసా?

Pawan Kalyan : టాలీవుడ్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వినగానే యూత్ కు పునకాలే.. ఎవరి మాట వినడు.. ట్రెండ్ ను సెట్ చేస్తాడు.. ఇలా ఆయన చేసే ప్రతిదీ యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది.. అందుకే పవన్ కళ్యాణ్ కు యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. పవన్ హీరోగానే కాదు.. ఒక డైరెక్టర్ గా , ఒక సాంగ్ కొరియోగ్రాఫేర్ గా , ఫైట్ మాస్టర్ గా, సింగర్ గా ఇలా తనలోని టాలెంట్ ను బయట పెడుతున్నాడు.. అయితే పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీ లోకి హీరో అవుదామని రాలేదట డైరెక్టర్ కావాలని వచ్చాడు. కానీ తన వదిన కారణంగా హీరో అవ్వాల్సి వచ్చిందని చాలా సందర్భాల్లో చెప్పాడు. డైరెక్టర్ అవ్వాలనే కసితో ప్రత్యేకంగా కోచింగ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఆయన మొదట చిరంజీవి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు.. ఆ సినిమా ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెడితే కేవలం డైరెక్టర్ అవ్వాలనే కోరిక తప్ప, పెద్దగా ఆశలు ఏమి లేని మనిషి.ఆ ఆసక్తే ఆయనని అసిస్టెంట్ డైరెక్టర్ ని చేసిందంటే ఎవరైనా నమ్ముతారా..? కానీ నమ్మక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి. మెగాస్టార్ చిరంజీవి నటించిన 100 వ సినిమాగా ‘లంకేశ్వరుడు’ అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే.. ఆ సినిమాకు దాసరినారాయణరావు దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ప్లాప్ అయ్యింది..ఈ సినిమా షూటింగ్ అప్పుడు పవన్ ప్రతి రోజూ లొకేషన్ కు వెళ్ళేవాడట..

Do you know any movie where Pawan Kalyan worked as an assistant director?
Do you know any movie where Pawan Kalyan worked as an assistant director?

అయితే ఓ రోజు అనుకోకుండా దాసరి నారాయణ రావు అసిస్టెంట్ డైరెక్టర్ కి అనారోగ్యం కారణంగా షూటింగ్ కి రాలేని పరిస్థితి ఏర్పడిందట.. వేరే అసిస్టెంట్ డైరెక్టర్ కోసం ఎదురు చూస్తున్న దాసరి కి చిరంజీవి ‘మా కళ్యాణ్ కి డైరెక్షన్ మీద చాలా ఆసక్తి ఉంది.. మీకు ఉపయోగపడుతాడు అనుకుంటే వాడిని అసిస్టెంట్ గా తీసుకోండి అన్నాడట.. దాసరి నారాయణరావు వెంటనే ఓకే చెప్పాడు.అలా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని రోజులు షూటింగ్ చేసాడని తెలుస్తుంది. మా హీరో ముట్టుకొని క్రాఫ్ట్ అంటూ ఏది మిగలలేదు.. అన్నీ చేసాడు.. ఇక ప్రస్తుతం.. ఈయన ఏపీకి డిప్యూటీ సీఏం గా వ్యవహారిస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు