Jeans Hero:@51 లో పెళ్లికి సిద్ధం.. వధువు ఎవరంటే..?

Jeans.. 1998లో ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా ప్రశాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం జీన్స్. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది అంతేకాదు 7 వింతలు ఒకే పాటలో చూపించి అందరిని అలరించారు. ఇప్పటికీ కూడా ఈ సినిమా పాటలు ఆడియన్స్ ను అలరిస్తున్నాయి అంటే ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఈ సినిమా హీరో ప్రశాంత్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. పలువురు స్టార్ హీరోల సినిమాలలో సెకండ్ హీరోగా లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు.

Jeans Hero: @51 in preparation for marriage.. who is the bride..?
Jeans Hero: @51 in preparation for marriage.. who is the bride..?

త్యాగరాజన్ కుమారుడే ప్రశాంత్..

ప్రముఖ నటుడు త్యాగరాజన్ కుమారుడైన ప్రశాంత్ ప్రేమశిఖరం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన, ఆ తర్వాత తొలిముద్దు, ప్రేమకావ్యం సినిమాలతో అమ్మాయిల కలల రాకుమారుడు అయిపోయారు. ఇక శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ సినిమాతో ఈయన క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. మధ్యలో తమిళ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన ఈయిన 2019లో రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమా ద్వారా మళ్ళీ రియంట్రీ ఇచ్చారు. ఇందులో రామ్ చరణ్ కి అన్నయ్య పాత్రలో నటించి అందరి మన్ననలు అందుకున్నారు.

@51 లో పెళ్లికి సిద్ధం..

అంతేకాదు ఇటీవల అంధగన్ సినిమాలో నటించిన ఈయన ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. తాజాగా అంధగన్ సినిమా సక్సెస్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రశాంత్ తండ్రి, ప్రముఖ నటుడు త్యాగరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ తెలిపారు. అమ్మాయిని వెతుకుతున్నామని త్వరలోనే అందరికీ శుభవార్త చెబుతామని తెలిపారు.

- Advertisement -

మొదటి భార్యతో విడాకులు..

ఇక 2005లో గృహలక్ష్మి అనే మహిళతో ప్రశాంత్ ఏడడుగులు వేశారు. అయితే ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేకపోయింది .వివాహం జరిగిన నాలుగేళ్లకే అంటే 2009లోనే వీరు విడాకులు తీసుకొని విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాడు ప్రశాంత్. అందుకే ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ప్రొఫెషనల్ కెరియర్ పైన దృష్టి పెట్టారు ప్రస్తుతం ఈయన వయసు 51 సంవత్సరాలు ఇక ఇప్పుడు తోడు కావాలనిపించిందో ఏమో కానీ కొత్త జీవితాన్ని కోరుకుంటున్నారు ప్రశాంత్ .అందులో భాగంగానే మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సరైన అమ్మాయి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశారు.

ప్రశాంత్ సినిమాలు:

హీరోగా వరస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో కీ రోల్ పోషిస్తున్నాడు. అందులో భాగంగానే స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ది గోట్.. ఈ సినిమాలో హీరోకి స్నేహితుడు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నిన్న ట్రైలర్ విడుదల చేయగా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు