Stree 2 Collections: బీభత్సం సృష్టిస్తున్న శ్రద్దా.. 4రోజుల్లోనే అన్ని రూ.వందల కోట్లా..?

Stree 2 Collections: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ , ప్రముఖ నటుడు రాజ్ కుమార్ రావు 2018 లో నటించి మంచి విజయాన్ని అందుకున్న చిత్రం స్త్రీ. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన మరో చిత్రం స్త్రీ 2.. హార్రర్ కామెడీ జానర్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్ అందుకొని రికార్డు సృష్టించింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల తో పోటీపడుతూ శ్రద్దా కపూర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు.

Stree 2 Collections: Shradda is creating chaos.. Rs.200 Crores in 4 days..?
Stree 2 Collections: Shradda is creating chaos.. Rs.200 Crores in 4 days..?

4 రోజుల్లోనే రూ.204 కోట్లు..

బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.204 కోట్లు వసూలు చేసినట్లు సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ ట్వీట్ ద్వారా వెల్లడించారు మొదటి రోజు కంటే కూడా నాలుగవ రోజు అత్యధిక కలెక్షన్లు వచ్చాయని స్పష్టం చేశారు. హార్రర్ , కామెడీ నేపథ్యంలో వచ్చిన స్త్రీ 2 చిత్రం కేవలం రూ.50 కోట్ల బడ్జెట్ తో మాత్రమే తెరకెక్కించారు కానీ ఊహించని విధంగా ఇంతటి ఘన విజయాన్ని సాధించడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పవచ్చు.

స్త్రీ 2 4 రోజుల కలెక్షన్స్..

శ్రద్ధా కపూర్ స్త్రీ 2 సినిమా ప్రీమియర్ షో ద్వారా రూ.8.5 కోట్లు రాబట్టగా ,విడుదలైన మొదటి రోజు రూ.51.8 కోట్లు వసూలు చేసింది. ఇక రెండవ రోజు రూ.31.4 కోట్లు రాగా, మూడవరోజు రూ.43.85 కోట్లు లభించాయి. ఇక నాలుగవ రోజు బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.55 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా. మొదటి రోజు కంటే నాలుగవ రోజు అత్యధికంగా కలెక్షన్లు రాబట్టినట్లు స్పష్టం అయ్యింది. ఇక ఆదివారం రోజు స్త్రీ 2 72.74% థియేటర్ ఆక్యుపెన్సీతో రన్ అయ్యాయి. ఇకపోతే ఈ చిత్రానికి పోటీగా అక్షయ్ కుమార్ , తాప్సి పన్ను నటించిన ఖేల్ ఖేల్ మే , వేద మరియు చియాన్ విక్రమ్ కాంబినేషన్లో వచ్చిన తంగళాన్ చిత్రాలతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్, పూరీ జగన్నాథ్ – రామ్ కాంబినేషన్లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమాలన్నీ కూడా ఆగస్టు 15వ తేదీన విడుదలయ్యాయి. కానీ అన్ని సినిమాలకు పోటీ ఇస్తూ శ్రద్దా కపూర్ నటించిన చిత్రం స్త్రీ 2 ఊహించని రికార్డు సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సృష్టిస్తూ దూసుకుపోతోంది.

- Advertisement -

తారాగణం..

ఇక ఇందులో నటించిన తారాగణం విషయానికొస్తే .. శ్రద్ధా కపూర్ , రాజకుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ మరియు అపరశక్తి కురాణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇలా మంచి క్రేజీ ఉన్న తారాగణం తో తెరకెక్కిన ఈ సినిమా ఒకరకంగా చెప్పాలంటే శ్రద్ధా కపూర్ లేడీ ఓరియంటెడ్ గానే వచ్చిందని చెప్పాలి. సీక్వెల్ గా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుని శ్రద్ధా కపూర్ ఖాతాలో మరో విజయాన్ని అందేలా చేసింది స్త్రీ 2.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు