Kiran Abbavaram – Rahasya Gorak: సింపుల్గా పెళ్లి.. ఎప్పుడు, ఎక్కడంటే..?

Kiran Abbavaram – Rahasya Gorak: ప్రముఖ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తన సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు కానీ స్టార్ హీరో రేంజ్ లో గుర్తింపు అయితే లభించలేదు. ముఖ్యంగా ఆ గుర్తింపు , సక్సెస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం “క” అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మళ్లీ ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు ఏడు అడుగులు వేయడానికి సిద్ధమయ్యారు కిరణ్ అబ్బవరం.

Kiran Abbavaram - Rahasya Gorak: Simple wedding.. when and where..?
Kiran Abbavaram – Rahasya Gorak: Simple wedding.. when and where..?

రహస్య గోరక్ తో నిశ్చితార్థం..

సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి నటన రంగంలోకి అడుగుపెట్టిన కిరణ్ అబ్బవరం రాజా వారు రాణి గారు అనే చిత్రంతో తొలిసారి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన రహస్య గోరక్ తో ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. ఇక త్వరలోనే ఈమెను తన జీవిత భాగస్వామిగా చేసుకోబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయం నుంచే ఆమెతో ప్రేమలో పడ్డ కిరణ్ అబ్బవరం రహస్యంగా ప్రేమ సాగిస్తూ వచ్చాడు. ఈ ఏడాది ఎట్టకేలకు తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఎట్టకేలకు మొన్నటి వరకు వచ్చిన రూమర్స్ అనే నిజమయ్యాయి అంటూ మీడియా కూడా కామెంట్స్ చేసింది.

కూర్గ్ లో వివాహం..

ఇక ఎప్పుడు వివాహం చేసుకుంటారు అంటూ వార్తలు రాగా త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఆగస్టు 22వ తేదీన ఈ జంట పెళ్లి తో ఒకటి కాబోతున్నారు. కర్ణాటకలోని కూర్గ్ లో వీరిద్దరి వివాహం చాలా సింపుల్ గా జరగబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రహస్య బంధువులంతా కూడా కూర్గ్ లోనే ఉండడం వల్ల పెళ్లి అక్కడే జరగాలని నిర్ణయించారట పెళ్లి పెద్దలు. మొత్తానికైతే మరో మూడు రోజుల్లో ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇక అప్పుడే ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అభిమానులు సెలబ్రిటీలు.

- Advertisement -

రహస్య గోరక్ కెరియర్..

1995 మార్చి 26వ తేదీన తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో జన్మించిన రహస్య తెలుగు, తమిళ్ సినిమాలలో కనిపించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. 2016 లో వచ్చిన షార్ట్ ఫిలిం ఆకాశమంత ప్రేమతో తన నటన జీవితాన్ని మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత బాయ్స్ ఇన్ స్కూల్స్ వంటి షార్ట్ ఫిలిం లో కూడా నటించింది. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన రాజా వారు రాణి గారు చిత్రంతో రాణి పాత్ర పోషించి మంచి ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుని ఇప్పుడు అదే సినిమాలో హీరోగా నటించిన కిరణ్ అబ్బవరంతో ఏడడుగులు వేయబోతోంది. 2024 మార్చి 13న హైదరాబాదులో వీరిద్దరి నిశ్చితార్థం జరగగా, ఇప్పుడు ఆగస్టు 2న వివాహం జరగబోతోంది. అంతేకాదు బుల్లితెరపై కూడా అరంగేట్రం చేసింది. 2021లో సర్బత్ అనే సినిమా ద్వారా తమిళ సినిమాల్లోకి కూడా అడుగు పెట్టింది రహస్య.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు