Phanindra Narsetti: తుది దశలో 8 వసంతాలు

Phanindra Narsetti: బ్యాక్ స్పేస్(Backspace) అని ఒక షార్ట్ ఫిలింతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు ఫణీంద్ర. ఆ తర్వాత ఫణీంద్ర చేసిన మధురం(Madhuram) షార్ట్ ఫిలిం అద్భుతమైన హిట్ అయింది. ఆ షార్ట్ ఫిలింతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించుకున్నాడు ఫణీంద్ర. ముఖ్యంగా ఆ షార్ట్ ఫిలిమ్స్ లోనే డైలాగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. కేవలం షార్ట్ ఫిలిమ్స్ లో మాత్రమే కాకుండా ఫణీంద్ర బయట మాట్లాడిన కూడా వినాలనిపించేలా ఉంటుంది తన భాష. ఒక మను(Manu) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు ఫణి. ఈ సినిమా ఊహించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ను సాధించలేకపోయింది. కానీ ఈ సినిమాకి ఇప్పటికీ ఒక కల్ట్ స్టేటస్ ఉంది.

Phanindra Narsetti

ప్రస్తుతం ఫణింద్ర నర్సేట్టి దర్శకత్వంలో MAD ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ కథానాయికగా నటిస్తున్న చిత్రం 8 వసంతాలు. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు శుద్ధి అయోధ్య. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్ విపరీతంగా ఆకట్టుకుంది. చెమ్మగిల్లిన కళ్లతో కదులుతున్న కవితలా కనిపిస్తున్నా, నవ్వుతూనే ఉంది. కళ్లకు మాస్కరా, చెవిపోగులు మరియు ముక్కు ఉంగరం ఆమెను మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేసాయి.

- Advertisement -

 

ఊటీ, హైదరాబాద్, కన్యాకుమారి వంటి పలు ప్రదేశాల్లో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఈ చిత్ర యూనిట్ కాశ్మీర్, ఆగ్రా, వారణాసి ప్రాంతాలకు వెళ్లనుంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ అయిపోతుందని మేకర్స్ చెబుతున్నారు.నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వనాథ్ రెడ్డి ఛాయాగ్రహణం, నరేష్ కుమారన్ సంగీతం అందిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు