Sangeetha: కనీస మర్యాద లేదు.. ఫోన్ చేస్తే ఆ మాటలు వినలేం.. ఎమోషనల్ అవుతున్న సంగీత.!

Sangeetha.. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో తన నటనతో , అందంతో ఎంతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది అలనాటి హీరోయిన్ సంగీత. ఈ ముద్దుగుమ్మ అటు టాలీవుడ్ లో , కోలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించింది. తనకు పాత్ర నచ్చితే సెకండ్ హీరోయిన్ గా కూడా నటించిన సందర్భాలు ఉన్నాయి. సంగీత కన్నడ , మలయాళం వంటి భాషలలో కూడా నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగా సంపాదించుకుంది. పెళ్లి అయిన తర్వాత చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ఉన్నది సంగీత. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తెలుగు ఇండస్ట్రీ పైన పలు వ్యాఖ్యలు చేసింది.

Sangeetha: There is no minimum courtesy.. You can't hear those words on the phone.. Sangeetha is getting emotional.!
Sangeetha: There is no minimum courtesy.. You can’t hear those words on the phone.. Sangeetha is getting emotional.!

తమిళ ఇండస్ట్రీలో మర్యాద ఇవ్వరు..

హీరోయిన్ సంగీత మాట్లాడుతూ.. తనకు తమిళ్ ఇండస్ట్రీ కంటే తెలుగు ఇండస్ట్రీ అంటేనే చాలా ఇష్టమని తెలియజేసింది.. తమిళ ఇండస్ట్రీలో ఎవరూ కూడా ఎలాంటి గౌరవం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారని అందుకే తనకు తమిళం కంటే తెలుగులో నటించడమే చాలా ఇష్టం అంటూ తెలియజేసింది. అయితే ఈ విషయం పై తమిళ అభిమానులు తన మీద ఫైర్ అయినప్పటికీ కూడా తాను పెద్దగా పట్టించుకోనని, ఎందుకంటే ఇది ఒక నిప్పులాంటి నిజం అంటూ తెలియజేసింది. తమిళ సినిమాలలో నటిస్తున్నప్పుడు ఎవరు కూడా గౌరవం మర్యాద అనేది ఇవ్వరని, అందుకే తమిళంలో ఎప్పుడూ కూడా తాను అవకాశాలు ఇవ్వండి అని అడగలేదని తెలిపింది సంగీత.

తెలుగు ఇండస్ట్రీ అంటేనే ఇష్టం.

తెలుగులో తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ప్రేక్షకుల ఆదరణ పొంది మంచి పారితోషకమే తీసుకుంటున్నాను అంటూ తెలియజేసింది. అంతేకాకుండా తమిళంలో కొంతమంది ఫోన్ చేసి అవకాశాల కోసం మర్యాద లేకుండానే మాట్లాడుతూ ఉన్నారని.. కేవలం తన కుటుంబాన్ని పోషిస్తున్నామన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపింది సంగీత. తమిళ సినీ ఇండస్ట్రీలో వారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే కనీసం కరెంట్ బిల్లు కూడా కట్టలేనేమో అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారని , తన రెమ్యూనరేషన్ కూడా వారే డిసైడ్ చేస్తూ ఉంటారని తెలిపింది. కేవలం వచ్చి నటించి వెళ్లిపో అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారని సంగీత తెలిపింది.

- Advertisement -

తమిళ ఇండస్ట్రీలో విచక్షణా రహితంగా ప్రవర్తిస్తారు..

అలా మాట్లాడినా కూడా వారికి నేను రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటాను. కానీ వారు మాత్రం నాకు మర్యాద ఇచ్చిన పాపాన పోలేదు అంటూ తెలిపింది సంగీత. అందుకే తనకు తమిళంలో నటించడం పెద్దగా ఇష్టం ఉండదని , తెలుగులో నటించడం ఇష్టం అంటూ సంగీత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయాన్ని విన్న అభిమానులు అయితే ఒకవైపు సపోర్ట్ చేస్తూనే మరొకవైపు ఫైర్ అవుతున్నారు. హీరోయిన్ సంగీత 2009లో ప్రముఖ సంగీత గాయకుడు అయిన క్రిష్ ను ప్రేమించి మరి వివాహం చేసుకున్నది. వీరికి ఒక కూతురు కూడా జన్మించింది. ఇటీవల యాంకర్ గా రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూనే పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటించింది. ముఖ్యంగా సంగీతకు మసూద సినిమా బాగా పేరు తెచ్చి పెట్టింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు