Karthik Dandu: చైతు సినిమాలో నాగార్జున, అక్కినేని అభిమానులకు పండుగే

Karthik Dandu: భమ్ భోలేనాథ్(Bham Bholenath) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు కార్తీక్ దండు. ఆ సినిమా కమర్షియల్ గా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా చేసిన విరూపాక్ష సినిమాను తీశాడు కార్తీక్(Karthik Dandu). ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాకి దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాతోనే పాన్ ఇండియా హీరో అయిపోయాడు సాయి దుర్గ తేజ్(Sai Durga Tej).

ప్రస్తుతం కార్తీక్ దండు నాగచైతన్య(Naga Chaitanya) హీరోగా సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. కాకపోతే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాలో యువసామ్రాట్ అక్కినేని నాగార్జున(Nagarjuna) ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఈ పాత్ర ఒక 10 నిమిషాల పాటు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఈ పాత్రకి మంచి ప్రత్యేకత ఉంది అని తెలుస్తుంది. అయితే దీనిని నాగార్జున చేస్తారా మరో హీరో చేస్తారా అని ఇంకా డిసైడ్ కాలేదు. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

Karthik Dandu

- Advertisement -

ఇక ప్రస్తుతం నాగచైతన్య చందు మొండేటి(Chandhu Mondeti) దర్శకత్వంలో తండేల్(Thandel) ఒక సినిమాను చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే ప్రేమమ్, సవ్యసాచి అనే సినిమాలు వచ్చాయి. మలయాళం ప్రేమమ్ సినిమాకి రీమేక్ తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధించుకుంది. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సవ్యసాచి సినిమా ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. కార్తికేయ సినిమాతో దర్శకుడుగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నాడు చందు. ఇప్పుడు వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు