Viraaji OTT : ఓటీటీలోకి వరుణ్ సందేశ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Viraaji OTT : టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫ్యాన్స్ ను అలరించిన ఆయన గత కొంతకాలంగా గ్యాప్ తీసుకున్నాడు. రీసెంట్ గా ఇన్నాళ్లకు ఓ సస్పెన్స్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమానే విరాజీ.. ఈ సినిమా ఈ మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. థియేటర్లలో విడుదలై మంచి టాక్ ను అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తుంది. ఏ ఓటీటీలో విడుదల కాబోతుందో ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుందాం..

హ్యాపీ డేస్ వంటి క్లాసిక్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్ ఆ తర్వాత కొత్త బంగారు లోకం వంటి హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత కుర్రాడు సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అది భారీ డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఒకటో రెండో సినిమాలతో పలకరించాడు. అవి అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేక పొయ్యాయి. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. విరాజీ అనే థ్రిల్లర్ మూవీలో నటించాడు..

Varun Sandesh Suspense Thriller movie on OTT.. Since when streaming?
Varun Sandesh Suspense Thriller movie on OTT.. Since when streaming?

విరాజి అంటూ కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకొచ్చాడు ఈ హీరో. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించగా.. ప్రమోదిని, రఘు కారు ముఖ్య పాత్రల్లో నటించారు. ఆగస్టు 02న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీకి కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆండీ పాత్రలో నటించి అందర్ని మెప్పించాడు వరుణ్ సందేశ్. మరో రెండు రోజుల్లో ఓటీటీలో సందడీ చేయనుంది..ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆగస్టు 22 నుంచి విరాజి మూవీ స్ట్రీమింగ్ కాబోతుందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.. ఇక్కడ ఎలాంటి టాక్ ను అందుకుందో ఇప్పుడు తెలుసుకుందాం..

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు