Rana Daggupati : ఫ్యాన్ కోసం రానా చేసిన పనికి షాక్.. హ్యాట్సాప్ చెప్పాల్సిందే భయ్యా..

Rana Daggupati : బాహుబలి హీరో రానా దగ్గుపాటి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. లీడర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈయన సినిమాలతో మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా స్టార్ హీరోనే. ఇది మేము అన్న మాట కాదు ఆయన ఫ్యాన్స్ అంటున్న మాట. తాజాగా రానాకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఫ్యాన్ కోరికను తీర్చడం కోసం ఆయన చేసిన పనికి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..

తమ అభిమాన హీరోల సినిమాలను థియేటర్లలో స్క్రీన్ మీద చూసుకొని ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంత కాదు. ఇక అదే హీరోను కళ్ల ముందు అడుగు దూరంలో చూస్తే ఫ్యాన్స్‌కి మాటలే రావు. తెలీకుండానే అంతటి అభిమానం, ఇష్టాన్ని పెంచేసుకుంటారు ఫ్యాన్స్. అలాంటి అభిమానులతో అంతే ప్రేమగా, ఆప్యాయంగా పలకరించే హీరోలు చాలా అరుదుగా ఉంటారు.. అలాంటి వారిలో దగ్గుపాటి రానా కూడా ఒకరు. తనకి నచ్చిన చోటికి నచ్చినప్పుడు బైక్‌పై వెళ్లిపోతుంటారు రానా. దారిలో ఎవరైనా పలకరిస్తే ఆప్యాయంగా వారితో మాట్లాడుతుంటారు. గతంలో ఆయన ఫ్యాన్స్ తో ముచ్చటిస్తున్న వీడియోలు చాలా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా మరో వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Rana met a fan in America.. Video viral
Rana met a fan in America.. Video viral

రానా తన భార్యతో కలిసి ప్రస్తుతం అమెరికా వెకేషన్ లో ఉన్నారు. చికాగోలో కారులో వెళ్తుండగా రానాను చూసిన ఓ ఫ్యాన్.. డ్రైవింగ్ చేస్తూనే పలకరించారు. దీంతో వెంటనే రానా కూడా హాయ్ అన్నారు. అంతేకాకుండా ముందర కారు ఆపుతా అంటూ తన ఫ్యాన్‌కి చెప్పారు. ఇంకేముంది కారు ఆపగానే అతను రానాను గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్ అయ్యాడు. తన ఫ్యామిలీని కూడా రానా పలకరించి ఆటో గ్రాఫ్ ఇచ్చాడు. అభిమాని గుండెల పై ఆటో గ్రాఫ్ ఇవ్వడం అందరిని ఆకట్టుకుంది. అలానే తన కారుపై కూడా సైన్ చేయాలంటూ కోరారు. ఈ అభిమానాన్ని చూసి రానా కూడా మురిసిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.. సినిమాల విషయానికొస్తే.. రెండు సినిమాలు చేస్తున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు