Manichitrathazhu : అసలైన చంద్రముఖి అంటే శోభన మాత్రమే , ఒళ్ళు గగుర్పుడిచే ఎక్సప్రెషన్స్

Manichitrathazhu : కొన్ని సినిమాలను చూస్తున్నప్పుడు అవి మనకు విపరీతంగా నచ్చుతాయి ఆ టైంలో మనకి అవి రీమేక్ సినిమాలోని తెలియకపోవచ్చు. అని కొన్ని రోజుల తర్వాత ఒరిజినల్ సినిమాను చూసినప్పుడు మనం ఆశ్చర్యానికి గురి అవ్వడం ఖాయం. ఏదైనా ఒరిజినల్ సినిమాకి ఉన్న ఇంపాక్ట్ వేరు. దాన్ని రీమేక్ చేసినప్పుడు కొంత మేరకు సోల్ అనేది పోతుంది. కానీ కొన్ని సినిమాలు విషయంలో రీమేక్ కూడా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ చేసిన ఖుషి(Kushi), మెగాస్టార్ చిరంజీవి చేసిన శంకర్ దాదా ఎంబిబిఎస్(Shankar Dada MBBS) ఈ రెండు సినిమాలు ఒరిజినల్ కంటే కూడా బాగుంటాయి.

రజనీకాంత్ హీరోగా పి వాసు(P.Vasu) దర్శకత్వంలో వచ్చిన సినిమా చంద్రముఖి(Chandramukhi). ఈ సినిమా ఇదే పేరుతో తెలుగులో కూడా డబ్బింగ్ అయి విడుదలైంది. తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఈ సినిమాను ఇష్టపడ్డారు. ఇప్పటికీ చూసినా కూడా ఈ సినిమాలో కొన్ని సీన్స్ మంచి ఎక్స్పీరియన్స్ ను ఇస్తాయి. ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో జ్యోతిక నటించింది. గంగ లోనికి సడన్ గా చంద్రముఖి ప్రవేశించినప్పుడు చూడటానికి ఆ సీన్ భయంకరంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆ సీన్ చూసి కొంతమంది భయపడుతూ ఉంటారు. ఇక చంద్రముఖి సినిమాకి మూలం మళయాళంలో వచ్చిన మణిచిత్రతాయు.

Manichithrathazhu

- Advertisement -

మణిచిత్రతాయు సినిమాకి ఫాజిల్ దర్శకత్వం వహించారు. ఇక్కడినుంచి అన్ని భాషల్లో ఈ సినిమా రీమేక్ అయింది. అయితే ఈ సినిమాలో శోభన నటించారు. ప్రస్తుతం ఈ సినిమా 4k వెర్షన్ మలయాళం లో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలోని కొన్ని క్లిప్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ముఖ్యంగా గంగ చంద్రముఖిగా మారిన సీన్ గురించి తెలిసిందే. అయితే ఈ సీన్ లో శోభన నటించిన తీరు వేరే లెవెల్ అని చెప్పాలి. కేవలం ఎక్స్ప్రెస్ తో భయాన్ని పుట్టించింది శోభన. అప్పటివరకు అమాయకంగా కనిపించి ఒక్కసారిగా తనలోనికి చంద్రముఖి ప్రవేశించినప్పుడు, శోభన చూపించిన ముఖ కవళికలు ఒళ్ళు గగుర్పుడిచేలా ఉన్నాయి అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు