Naga Chaitanya – Samantha: అప్పుడే చైతూ మూవీ లో శోభిత.. పక్కా ప్లానింగ్ గురూ..!

Naga Chaitanya – Samantha: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న జంట ఏదైనా ఉందంటే అది సమంత – నాగచైతన్య మాత్రమే. ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన సమంత , అదే సినిమాలో హీరోగా చేసిన నాగచైతన్యతో ప్రేమలో పడింది. దాదాపు 7 సంవత్సరాల పాటు ప్రేమాయణం కొనసాగించిన ఈ జంట పెద్దలను ఒప్పించి మరీ 2017లో వివాహం చేసుకున్నారు. వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట అనూహ్యంగా 2021 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇదే సమయంలో ఈ జంట పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ప్రముఖ స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ తో సమంత ఎఫైర్ పెట్టుకుందని, దాన్ని చూసి తట్టుకోలేక నాగచైతన్య విడాకులు ఇచ్చారంటూ సమంత పై లేనిపోని అభాండాలు వేశారు.

Naga Chaitanya - Samantha: Sobhita in the movie Chaithu.. Perfect planning guru..!
Naga Chaitanya – Samantha: Sobhita in the movie Chaithu.. Perfect planning guru..!

సమంతపై నిందలు..

దీనిపై స్టైలిస్ట్ స్పందించినా సరే ఎవరు కూడా రూమర్స్ కి అడ్డుకట్ట వేయలేకపోయారు. పైగా నాగచైతన్య కూడా ఈ విషయంపై నోరు మెదపలేదు. ఇక ఆ సమయంలో ఎంతో మానసికంగా కృంగిపోయిన సమంత, ఒకవైపు రూమర్స్ మరొకవైపు మయోసైటిస్ అన్నీ ఆమెను మరింత ఇబ్బంది పెట్టేసాయ్. అలా దాదాపు సంవత్సరం పాటు ఇండస్ట్రీకి కూడా దూరం అయింది. అదే సమయంలో నాగచైతన్య ప్రముఖ హీరోయిన్ శోభితతో ఎఫైర్ నడుపుతారంటూ వార్తలు వైరల్ అయ్యారు. అయితే ఈ విషయాలపై ఎవరు స్పందించలేదు. కానీ అనూహ్యంగా ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకోవడం ఆ ఫోటోలను డైరెక్ట్ గా నాగార్జున ఎక్స్ ద్వారా షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇన్ని రోజులు సమంత పై అబాండాలు వేశారు కానీ నాగచైతన్య సైలెంట్ గా ఉంటూనే అన్నీ కానిచ్చేసారు అంటూ కామెంట్లు చేయడం గమనార్హం.

సమంతతో వివాహం కాకముందు శోభితతో పరిచయం..

అయితే ఇక్కడ ఆశ్చర్యపోయే ఘటన మరొకటుంది.. నాగచైతన్య – సమంత వివాహం తర్వాత చేసిన చిత్రం మజిలీ. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ జంట కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ కూడా హీరోయిన్ గా నటించింది. ఆ సమయంలో నాగచైతన్య ఈమెతో ఎఫైర్ నడిపారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా సమయంలో శోభిత తో ఎఫైర్ ఉందనే విషయాన్ని ఎవరూ గ్రహించలేకపోయారు.

- Advertisement -

అప్పటి నుంచే సమంత శోభిత మధ్య కోల్డ్ వార్..

దీనికి తోడు నాగచైతన్య – సమంత వివాహం కాకమునుపే శోభితతో అక్కినేని ఫ్యామిలీకి మంచి అనుబంధం ముందట. ఈ సమయంలోనే మజిలీ సినిమా కోసం హీరోయిన్ల వెతుకులాటలో ముందుగా డైరెక్టర్ శివ శోభిత పేరు పరిశీలించారు. నాగచైతన్య కూడా ఆమె తో కొన్ని సన్నివేశాలు షూటింగ్ కూడా చేశారట .ఈ విషయం సమంతకు తెలియదు. అయితే షూటింగ్ లొకేషన్లోకి వచ్చిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న సమంత నాగచైతన్యతో విభేదించింది . ఈ చిత్రం నుండి ఆమెను తప్పిస్తేనే , తాను ఈ సినిమా చేస్తాను అంటూ కరాకండిగా చెప్పేసిందట సమంత. దీంతో సమంత కోసం శోభితను ఆ సినిమా నుంచి తప్పించి, దివ్యాంశ కౌశిక్ ని తీసుకున్నారు.

పక్కా ప్లానింగ్ తోనే సమంతకు విడాకులు..

శివ అప్పటి నుండే సమంత, శోభిత మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ విషయాన్ని ఎవరి గ్రహించలేదు. మొత్తానికైతే అది పెరిగి పెద్దదయి తన భర్తతో విడాకులు తీసుకోవడానికి కూడా దారితీసింది అని చెప్పవచ్చు. ఏదిఏమైనా పక్కా ప్లానింగ్ తోనే సమంతకు విడాకులు ఇచ్చారు అంటూ సమంత అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై అక్కినేని ఫ్యాన్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు