Ileana: క్యాస్టింగ్ కౌచ్ టాలీవుడ్ లో కూడా.. హాట్ బాంబు పేల్చిన గోవా బ్యూటీ..!

Ileana.. ఎప్పుడైతే మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో జస్టిస్ హేమా (Justice hema) కమిటీ 233 పేజీలు కలిగిన ఒక నివేదికన సమర్పించిందో అప్పటినుంచి చాలామంది సెలబ్రిటీలు తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్యలపై ఒక్కొక్కరిగా నోరు విప్పుతున్నారు. అందులో భాగంగానే సంగీత (Sangeetha ), సనమ్ శెట్టి(Sanam Shetty)కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ కౌచ్ సమస్య వుందని, తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఒక్కొక్కరిగా చెప్పుకు రాగా.. ఇప్పుడు మాలీవుడ్ , కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఉన్నాయంటూ ప్రముఖ గోవా బ్యూటీ ఇలియానా చెప్పుకొచ్చింది.

Ileana: Casting couch in Tollywood too.. Goan beauty who exploded a hot bomb..!
Ileana: Casting couch in Tollywood too.. Goan beauty who exploded a hot bomb..!

టాలీవుడ్ కి దూరమై కెరియర్ నాశనం..

గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో టాప్ ప్లేస్ ని సంపాదించుకుంది గోవా బ్యూటీ ఇలియానా. ఈ ముద్దుగుమ్మ నడుము అందానికి చాలామంది కుర్రకారు సైతం ఫిదా అయ్యేవారు. టాలీవుడ్ లోనే అతి తక్కువ సమయంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా కూడా పేరు సంపాదించింది. ఎంతోమంది స్టార్ హీరోలకు జోడీగా నటించిన ఇలియానా.. టాలీవుడ్ లో క్రేజ్ పీక్స్ లో వున్న సమయంలో.. ఒక్కసారిగా బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి తన కెరీర్నే నాశనం చేసుకుంది. ఇదే ఇలియానా కెరియర్ ను సైతం నాశనం చేయడానికి కారణమైందని కూడా అభిమానులు భావిస్తూ ఉంటారు.

కథలు ఎంపిక విషయంలో తడబాటు..

తెలుగు సినీ పరిశ్రమకు మొదటిసారి దేవదాసు సినిమాతో పరిచయమైంది హీరోయిన్ ఇలియానా. పోకిరి సినిమా ఇలియానా కెరియర్నే మలుపు తిప్పింది.. ఆ తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చలామణి అయిన ఇలియాన కోటి రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ గా కూడా పేరు సంపాదించింది. కానీ నెమ్మదిగా ఇలియానా సరైన కథలను ఎంచుకోవడంలో ఫెయిల్ అవ్వడంతో పాటుగా అప్పటికే కాజల్ అగర్వాల్ కి మంచి క్రేజ్ రావడంతో వచ్చిన అవకాశాలు కూడా కాజల్ అగర్వాల్ అందుకునేది. అలాంటి సమయంలోనే ఇలియానా బాలీవుడ్ వైపుగా అడుగులు వేసింది.

- Advertisement -

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్..

అయితే ఇలియానా బాలీవుడ్ వైపుగా అడుగులు వేయడానికి ఒక ముఖ్య కారణం ఉందనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే గతంలో ఇంటర్వ్యూలో ఒక ఇలియానా మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఆమె తెలియజేసింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనను కూడా చాలామంది డైరెక్టర్లు లైంగికంగా వేధించారని, అందులో కొంతమంది తెలుగు దర్శకులు కూడా ఉన్నారని తెలియజేసింది. అంతేకాకుండా ఒక డైరెక్టర్ అయితే తనను చాలా టార్చర్ పెట్టడంతో సూసైడ్ చేసుకోవాలనుకున్నానని , కానీ తన కుటుంబం గుర్తుకు వచ్చి ఆ నిర్ణయాన్ని వదిలేసుకున్నానని తెలిపింది ఇలియానా.

డైరెక్టర్ పేరు చెప్పని ఇలియానా..

అయితే ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుకొని ఇలాంటి విషయాలన్నీ లైట్ గా తీసుకున్నానంటూ ఇలియానా వెల్లడించింది. కానీ తన దగ్గర ప్రవర్తించిన డైరెక్టర్ పేరు మాత్రం బయట ఎక్కడా చెప్పలేదు ఇలియానా. అయితే ఈ విషయం విన్న ఇలియానా అభిమానులు ఆ డైరెక్టర్ ఎవరా అని ఆరాధిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లోనైనా ఇలియానా ఆ డైరెక్టర్ పేరు చెబుతుందేమో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు