HBD Chiranjeevi: చిరు పూజ గదిలో ఆ ఇద్దరికీ ప్రత్యేక స్థానం.. ఎవరంటే..?

HBD Chiranjeevi.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్వయంకృషితో అడుగుపెట్టి మూలాలను మర్చిపోకుండా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ఎన్టీఆర్ , ఏఎన్నార్ వద్ద ఎన్నో మెలుకువలు నేర్చుకొని ఆ తర్వాత తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లల్లో సహాయ నటుడిగా పనిచేసిన చిరంజీవి , ఆ తర్వాత విలన్ గా కూడా నటించారు. ఇక ఖైదీ నెంబర్ 150 సినిమాతో సోలో హీరోగా భారీ విజయాన్ని సొంతం చేసుకొని, సినీ కెరియర్ లో వెనుతిరిగి చూడలేదు. అలా ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించిన చిరంజీవి, ఇప్పటికీ కూడా వరుస సినిమాలు చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు.

HBD Chiranjeevi: A special place for those two in the chiru pooja room..whose..?
HBD Chiranjeevi: A special place for those two in the chiru pooja room..whose..?

చిరంజీవి డ్రీమ్ హౌస్..

ఇదిలా ఉండగా ఈరోజు చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈయన గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే చిరంజీవి తనకంటూ ప్రత్యేకంగా డ్రీమ్ హౌస్ ను నిర్మించుకున్నారు. ఆ ఇంటిలో పూజ గది, ఆ పూజ గదిలో ఇద్దరి వ్యక్తుల ఫోటోలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. దేవుళ్ల పటాల పక్కన ఆ ఇద్దరి ఫోటోలు పెట్టుకొని ఇప్పటికీ పూజిస్తున్నారట చిరంజీవి. మరి ఈ ఇద్దరు ఎవరు.. వారిద్దరినే ప్రత్యేకంగా పూజించడానికి గల కారణం ఏమిటి? అనే విషయాలుగా వైరల్ గా మారుతున్నాయి.

పూజ గదిలో నాన్న ,మామ ఫోటోలు..

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో మెగాస్టార్ చిరంజీవి సుమారు రూ.100 కోట్ల ఖర్చుతో తనకంటూ ఒక ప్రత్యేకమైన డ్రీమ్ హౌస్ ను నిర్మించుకున్నారు. ఈ ఇంటి ప్రత్యేకతల విషయానికి వస్తే, రెండవ ఫ్లోర్లో సూర్యుడు ఉదయించగానే , ఆయన పలకరింపుతో స్విమ్మింగ్ పూల్ పులకరించిపోయే సన్నివేశాలు మనం చూడవచ్చు. అంతేకాదు కింద ఫ్లోర్లో ప్రత్యేకంగా పూజ గదిని ఏర్పాటు చేశారు. ఆ పూజ గది దేవాలయంగా అనిపిస్తుంది అందులో దేవుడి పటాలతో పాటు చిరంజీవి తండ్రి వెంకటరావు కొణిదెల( Venkata Rao konidela) , చిత్రపటంతో పాటు ఆయన పక్కనే తనకు పిల్లనిచ్చిన మామ, సినీ ఇండస్ట్రీలో జీవితాన్ని అందించిన గురువు అయినటువంటి అల్లు రామలింగయ్య ( Allu Ramalinghia)ఫోటోని పెట్టారు. దేవుడి చిత్రపటాలతో పాటు వీరిద్దరికీ కూడా నిత్యం పూజ చేస్తూ తన భక్తిని అలాగే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన వీరిద్దరిని నిత్యం గుర్తు చేసుకుంటూ సక్సెస్ దిశగా అడుగులు వేస్తున్నారు చిరంజీవి. ఇక ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

చిరంజీవి సినిమాలు..

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే, రాజకీయాల నుంచి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈయన సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు.అందులో భాగంగానే వాల్తేరు వీరయ్య (Walter veerayya)సినిమాతో మంచి విజయాన్ని గత ఏడాది తన ఖాతాలో వేసుకున్నారు. కానీ అదే ఏడాది వచ్చిన భోళాశంకర్ డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు రీమేక్ చిత్రాలను పక్కనపెట్టి డైరెక్ట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వశిష్ట మల్లిడి (vashista mallidi)దర్శకత్వంలో విశ్వంభర (Vishwambhara)సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు