Viswambhara : చిరు బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కు ఇక పూనకాలే..

Viswambhara : టాలీవుడ్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెబుతున్నారు. చిరు నటిస్తున్న సినిమా అప్డేట్ ను కూడా తాజాగా మేకర్స్ వదిలారు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.. ఈ సినిమాలో చిరు యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. తాజాగా ఈ సినిమా నుంచి చిరు బర్త్ డే సర్ ప్రైజ్ గా పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ మూవీతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి దర్శకుడు వశిష్ట ఏదొక కొత్తదాన్ని పరిచయం చేస్తున్నాడు.. ఈ సినిమా పోస్టర్ ను చూస్తే అర్థం అవుతుంది. చిరు లుక్ అదిరిపోయింది. ఆ పోస్టర్ ను చూస్తుంటే ఏదో పవర్ ఫుల్ స్టోరీలాగా కనిపిస్తుంది. జనవరి 10 న వచ్చే ఏడాది సినిమా రిలీజ్ కాబోతున్నట్లు పోస్టర్ లో ప్రకటించారు. ప్రస్తుతం పోస్టర్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ను దించింది. రంగ్ దే బసంతి, డాన్ 2, డియర్ జిందగీ మొదలైన అనేక బాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో నటించిన నటుడు విశ్వంభరలో పవర్ ఫుల్ పాత్ర కోసం ఎంపికయ్యాడు. మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అయ్యాడు..

Chiru's birthday surprise has arrived viswambara poster release
Chiru’s birthday surprise has arrived viswambara poster release

ఇకపోతే ఈ సినిమా కోసం చిరు పెద్ద రిస్క్ చేస్తున్నాడు.. డూప్ లేకుండా తానే యాక్షన్ సీన్లను చేస్తున్నాడు.. విశ్వంభర సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, ప్రముఖ లెన్స్‌మెన్ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు