Megastar Chiranjeevi: చిరంజీవి బర్త్ డే స్పెషల్.. విలన్ గా చేసిన సినిమాలు ఇవే..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ).. తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆయన ఆదర్శం. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వయం కృషితో పైకొచ్చాడు. ఇప్పుడు స్టార్ హీరోగా అభిమానుల మన్ననలను పొందాడు. ఆయన సినిమాలతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు చిరంజీవి. ఆయన సినీ ప్రస్థానం గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా ఏదో మిగిలే ఉంటుంది.. ఆయన బర్త్ డే సందర్బంగా ఆయన కేరీర్ ఎలా మొదలైందో? విలన్ గా ఎన్ని సినిమాల్లో నటించాడో ఒక్కసారి గుర్తు చేసుకుందాం..

చిరంజీవి బాల్యం , విద్యాబ్యాసం ..

ఈయన 1955 ఆగష్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో జన్మించారు. చిన్న తనం నుంచే నటన పై ఆసక్తి ఉండటంతో చదువు పూర్తి చేసుకొని 1976లో చెన్నై కి వెళ్ళి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేరారు. 1978లో పునాది రాళ్లు సినిమాతో హీరోగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ఫ్రూవ్ చేసుకుంటూ ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికి సినిమాలను వదలకుండా చెయ్యడం ఈయనకే సాధ్యం.

ఇకపోతే చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్ ( Siva Sankara Varaprasad ).. ఈ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ చిరంజీవి అంటే మాత్రం అందరి నోటా మెగాస్టార్ అనే నినాదం వస్తుంది. సినీ నటుడిగా ఆయన ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి నటుడిగా మారి స్టార్ హీరోగా ఎదిగి కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు చిరంజీవి.. ఈయన 1978లో పునాది రాళ్లు (Punadi Rallu ) సినిమాతో హీరోగా మారారు చిరంజీవి.. కానీ ఈ సినిమా కంటే ముందు ప్రాణం ఖరీదు అనే సినిమా రిలీజ్ అయ్యింది. బాపు దర్శకత్వంలో వచ్చిన మనవూరి పాండవులు అనే సినిమాతో చిరంజీవికి మంచి గుర్తింపు వచ్చింది.

- Advertisement -

చిరంజీవి విలన్ గా చేసిన సినిమాలు..

Chiranjeevi's birthday special.. These are the movies he did as a villain.
Chiranjeevi’s birthday special.. These are the movies he did as a villain.

మెగాస్టార్ హీరోగానే కాదు విలన్ గాను నటించారు చిరంజీవి. 1979లో వచ్చిన ఐ లవ్ యు( I L U ) అనే సినిమాలో ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. 1979 లో చిరంజీవి నటించిన సినిమాలు ఏకంగా 8 రిలీజ్ అయ్యాయి. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోలు రాణిస్తున్న సమయంలోనూ చిరంజీవి తన సినిమాలతో ఆకట్టుకొని అభిమానులను మనసు దోచుకున్నాడు.. ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోలు రాణిస్తున్న సమయంలోనూ చిరంజీవి తన సినిమాలతో ఆకట్టుకొని అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇకపోతే బ్రేక్ డాన్స్ ను మెగాస్టార్ చిరంజీవి పెట్టింది పేరు. ఆయన స్టెప్పులకు ఊగని ప్రేక్షకులు ఉండరు. యాక్షన్ హీరోగానే కాదు జాధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి సినిమాలో హాస్యప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వయంకృషి చిత్రంతో చిరంజీవి మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది బహుమతి అందుకున్నారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. గెస్టు రోల్లో కూడా కనిపించి మెప్పించాడు.. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంత్రిగా పనిచేసారు..2013 లో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికి కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు మెగాస్టార్. రీసెంట్ గా చిరంజీవి భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు చిరు. విశ్వంభరా( Viswambara ) మూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది.. తాజాగా ఈయన బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ అయ్యింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు