Telugu Indian Idol Season 3: యాక్సిడెంట్ బయట పెట్టకుండా చాలా సఫర్ అయిన యంగ్ హీరో

Telugu Indian Idol Season 3: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్లో నవీన్ పోలిశెట్టి ఒకరు. ముందుగా చిన్న చిన్న సినిమాల్లో కొన్ని పాత్రలో కనిపించిన నవీన్. ఆ తర్వాత తెలుగు ఫిలిమ్స్ కి కొన్ని ఏళ్లపాటు గ్యాప్ ఇచ్చి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. ఎక్కడిదో ఒక్కసారిగా నవీన్ పోలిశెట్టి ఫేమస్ అయిపోయాడు. ఈ సినిమా తర్వాత నవీన్ చేసిన సినిమా జాతి రత్నాలు. సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత మిస్టర్ శెట్టి మెసేజ్ పోలిశెట్టి అనే సినిమాను చేశాడు నవీన్. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది.

నవీన్ ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలు కూడా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. నవీన్ కొంత టైం తీసుకున్న కూడా క్వాలిటీ ఫిలిమ్స్ చేస్తాడు అని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది. నవీన్ పోలిశెట్టి ఒక సినిమాకి సైన్ చేశాడు అని అంటే ఏమీ ఆలోచించకుండా సినిమాకి వెళ్లిపోవచ్చు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. రీసెంట్ గా నవీన్ ఒక యాక్సిడెంట్ కి గురి అయిన సంగతి తెలిసిందే. ఆ విషయం కూడా నవీన్ రివీల్ చేశాడు. ఇకపోతే రీసెంట్గా ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 3కి గెస్ట్ గా హాజరయ్యాడు నవీన్ పోలిశెట్టి.

నవీన్ కి మేజర్ ఆక్సిడెంట్

దీనికి సంబంధించిన ప్రోమోను రీసెంట్గా రిలీజ్ చేశారు. ఈ ప్రోమో లో నవీన్ పోలిశెట్టి హైలెట్గా నిలిచాడు. తనదైన శైలిలో నవ్విస్తూ ఒక హిందీ పాటను పాడి కూడా అందరినీ అలరించాడు. ఆ పాట విన్న వెంటనే నవీన్ లో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా అని కూడా అనిపించుకున్నాడు. ఇకపోతే నవీన్ తనకి జరిగిన మేజర్ ఆక్సిడెంట్ గురించి మొదటిసారి నోరు విప్పాడు. తన చెయ్యికి విపరీతమైన గాయం అయిందని, అది మళ్లీ తిరిగి మామూలుగా అవ్వడం కోసం చాలా ట్రై చేశానని, ఇప్పుడు కొంచెం బెటర్ అంటూ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

Navin Polishetty

అయితే ఈ రెండు నెలల్లో తను చాలా లో అయిపోయాను అంటూ ఫీల్ అయ్యాడు నవీన్. మన లో మూమెంట్లో ఉన్నప్పుడు తనకి మ్యూజిక్ మంచి హెల్ప్ అయింది అంటూ సంగీతానికి ఉన్న ప్రాధాన్యతను మరొకసారి తన మాటల్లో చెప్పుకొచ్చాడు నవీన్ పోలిశెట్టి. అయితే నవీన్ ఈ విషయం చెప్పినంత వరకు కూడా ఇంత మేజర్ ఆక్సిడెంట్ నవీన్ కి జరిగిందని ఎవరికి తెలియదు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఒక లెటర్ ని కూడా రిలీజ్ చేశాడు ఆ తర్వాత అందరూ నవ్వుకునేలా ఒక వీడియోను కూడా చేశాడు నవీన్. కానీ ఆ నవ్వు వెనకాల ఇంత బాధ ఉంది అని ఈ ప్రోమో చూసిన తర్వాత అర్థమైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు