Boycott Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏం మాట్లాడినా సెన్సేషనల్ అవుతుంది. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత మెగా & అల్లు అర్జున్ పై ట్రోల్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 అప్డేట్స్ అయితే రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరి ఫ్యామిలీల మధ్య గొడవలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ గొడవల పై ఇరు ఫ్యామిలీలు రెస్పాండ్ అవ్వలేదు. నిన్న అల్లు అర్జున్ ఇచ్చిన స్టేట్మెంట్ జనాలను ఆలోచనలో పడేసింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లు గొడవలు నిజమే అని అర్థమవుతుంది. ఓ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడిన మాటల వల్ల మెగా ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. ఆయనను ఇండస్ట్రీ నుంచి బాయకాట్ చెయ్యాలని నినాదాలు చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అల్లు అర్జున్ వివాదాస్పద వ్యాఖ్యలు..
ఇష్టమైనవాళ్లకి మనం చూపించాలి.. మనం నిలబడగలగాలి.. అది మన ఫ్రెండ్ అనుకో.. ఇంకొకళ్లు అనుకో.. మనకి కావాల్సిన వాళ్లు అనుకో.. నాకిష్టమైతే నేను వస్తా.. నా మనసుకి నచ్చితే నేను వస్తా.. ఇది అల్లు అర్జున్ తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్. నంద్యాల ఇష్యూ తర్వాత బన్నీ ఇప్పటివరకూ అల్లు Vs మెగా వివాదంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ తాజాగా మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం ఇండైరెక్ట్‌గా గట్టి కౌంటర్లే ఇచ్చారు. ఆ ఈవెంట్ వీడియో వైరల్ అవుతుంది..
నాకిష్టమైతే నేను వస్తా అన్న ఒక్క మాటతో నంద్యాల కావాలనే వెళ్లా.. నా ఫ్రెండ్ కోసం అని చెప్పకనే చెప్పారు అల్లు అర్జున్.. నా మనసుకి నచ్చితే నేను చేస్తా అనే మాటతో ఇటీవల పవన్ కళ్యాణ్ పుష్ప 2పై చేసిన ఇండైరెక్ట్ కామెంట్లకి కౌంటర్ ఇచ్చినట్లు అయింది. ఇక డిసెంబర్ 6న ఎవరొచ్చినా తగ్గేదేలే అంటూ స్టేజ్ మీదే ఓ క్లారిటీ ఇచ్చేశారు బన్నీ-సుకుమార్. ఈ స్పీచ్ వీడియోను బన్నీ ఫ్యాన్స్ గట్టిగానే వైరల్ చేస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ షురూ చేశారు.
Boycott Allu Arjun..
అల్లు అర్జున్ మాట్లాడిన ఒక్కో మాటకి కౌంటర్లు ఇస్తూ కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.. దీంతో బన్నీ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ మొదలైనట్లుంది. బన్నీ గతంలో ఏ ఈవెంట్ కు వెళ్లిన మెగా హీరోల గురించి మాట్లాడకుండా ఉండేవాడు కాదు.. కానీ నిన్న జరిగిన ఈవెంట్ లో మాత్రమే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం తో వీరి మధ్య గొడవలు నిజమే అని నమ్ముతున్నారు. బన్నీ చేసిన కామెంట్లపై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఫ్యాన్స్‌ను చూసి హీరో అయ్యానంటున్న బన్నీకి తన మొదటి సినిమా గంగోత్రి సమయంలో అసలు ఫ్యాన్సే లేరుగా అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఇది ఎంతవరకు వెళుతుందో చూడాలి.. ఇక పుష్ప 2 రిలీజ్ అవుతున్న నెలలోనే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా రిలీజ్ కాబోతుంది. ఇలా బన్నీ ఇచ్చిన ఒక్క స్పీచ్‌తో మెగా Vs అల్లు వివాదం ఇంకాస్త రాజుకుంది.
బన్నీ స్పీచ్ పుష్ప2పై ఎఫెక్ట్ పడుతుందా?
బన్నీ నిన్న ఈవెంట్ లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఓ రేంజులో ట్రోల్స్ అందుకుంటున్నాయి. అయితే ఆయన స్పీచ్ పై ఒకింత సంతోషంగా ఉన్న ఫ్యాన్స్, మరోవైపు టెన్షన్ పడుతున్నారు. పుష్ప 2 పై ఎఫెక్ట్ పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల వాయిదా పడేలా ఉంది. మరి ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని టెన్షన్ పడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి..