Pawan Kalyan : నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ ను డిస్టర్బ్ చెయ్యలేదు – బి. గోపాల్

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుసగా ఏడు హిట్ సినిమాలు అందుకున్నారు పవన్ కళ్యాణ్. కానీ ఖుషి తర్వాత దాదాపు 10 ఏళ్లపాటు ఒక హిట్ సినిమా కూడా పవన్ కళ్యాణ్ కెరియర్ లో లేదు. బేసిగ్గా వరుస డిజాస్టర్ సినిమాలు వచ్చినప్పుడు, క్రేజ్ తగ్గుతూ ఉంటుంది. రెమ్యునరేషన్ కూడా తగ్గుతుంది. కానీ వీటన్నిటికీ అతీతంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరిగింది రెమ్యూనరేషన్ కూడా పెరిగింది. అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని చాలామంది ప్రయత్నాలు చేశారు. కానీ అది కొందరికి మాత్రమే సాధ్యమైంది.

ఇక సీనియర్ దర్శకులు బి.గోపాల్ మెగాస్టార్ చిరంజీవితో మొత్తం మూడు సినిమాలు చేశారు. స్టేట్ రౌడీ, మెకానిక్ అల్లుడు, ఇంద్ర సినిమాలకు బి.గోపాల్ దర్శకత్వం వహించారు. అయితే ఇంద్ర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చిరంజీవితో బి.గోపాల్ కి మంచి పరిచయం ఉంది ఆ తరుణంలో పవన్ కళ్యాణ్ కూడా అప్పుడప్పుడు బి గోపాల్ కి కనిపిస్తూ ఉండేవాళ్ళు తరచు మాట్లాడుతూ ఉండేవాళ్ళు అయితే ఈ ప్రాసెస్లో పవన్ కళ్యాణ్ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో సినిమా వస్తుంది అని అందరూ ఊహించారు. దీనిపైన బి గోపాల్ క్లారిటీ ఇచ్చారు.

Pawan Kalyan

- Advertisement -

పవన్ కళ్యాణ్ ఎప్పుడు కనిపించినా అప్పుడప్పుడు బాగా మాట్లాడుతూ ఉండే వాళ్ళని, అయితే ఆయనకి ఎప్పుడు కథను చెప్పే ప్రయత్నం చేయలేదు అని బి గోపాల్ రీవీల్ చేశారు. సినిమా పరంగా ఆయనని ఎప్పుడూ నేను డిస్టర్బ్ చేయలేదు అంటూ రీసెంట్ గా ఇంద్ర రీ రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. బి గోపాల్ ఇంద్ర టైంలో అనుకుని ఉండి ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తో సినిమాను చేసి ఉండే వాళ్ళు అనేది కొంతమంది అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు