Manchu Lakshmi: జస్టిస్ హేమా కమిటీ పై మంచు డాటర్ కామెంట్స్..!

Manchu Lakshmi.. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో మహిళల పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయం కాస్త ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దాదాపు 233 పేజీలు కలిగిన ఒక నివేదికను జస్టిస్ హేమ కమిటీ కోర్టులో సమర్పించగా ఈ విషయాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఈ విషయాలపై ఒక్కొక్క హీరోయిన్ మీడియా ముందుకు వచ్చి మరీ స్పందిస్తున్నారు. అందులో భాగంగానే జస్టిస్ హేమా (Justice hema)కమిటీపై మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu)డాటర్ మంచు లక్ష్మి(Manchu Lakshmi)స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

manchu-lakshmi-manchus-daughter-comments-on-justice-hema-committee
manchu-lakshmi-manchus-daughter-comments-on-justice-hema-committee

అన్యాయం జరిగితే వెంటనే స్పందించాలి..

తాజాగా జస్టిస్ హేమ సమర్పించిన నివేదికను ఉద్దేశించి నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ఒక ఇంగ్లీష్ పత్రిక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ… ప్రస్తుత సమాజంలో మహిళలకు సరైన చోటు లేదు. కనీసం ఇప్పటికైనా మార్పు రావాలని కోరుకుంటున్నాను. హేమ కమిటీ రిపోర్ట్ గురించి నాకు పూర్తిగా తెలియదు కానీ సమాజంలో మహిళలకు సమానత్వం ఉండాలని నేను కోరుకుంటున్నాను. అన్యాయం జరిగిన వెంటనే బాధితురాలు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

లైంగిక వేధింపుల కారణంగా ఉద్యోగాన్ని కూడా కోల్పోయా..

అంతేకాదు ఏ రంగంలో అయినా సరే మహిళలు ప్రతిభావంతులుగా ఉండాలని, ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఆమె తెలిపింది. అలాగే ఇండస్ట్రీలో జరిగే లైంగిక వేధింపుల గురించి కూడా మాట్లాడుతూ.. నువ్వు బలహీనంగా ఉండడమే ఎదుటి వారికి మరింత బలంగా మారుతుంది. నువ్వు ఎవరితో కూడా చెప్పలేవు అని తెలిసిన తర్వాత, అంత ధైర్యం లేదని భావించిన తర్వాత, కొంతమంది వ్యక్తులు నిన్ను టార్గెట్ చేసి లైంగికంగా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటి వారికి నువ్వు కచ్చితంగా నో చెప్పడం నేర్చుకోవాలి. కెరియర్ మొదలుపెట్టిన సమయంలో నన్ను కూడా ఇలా కొంతమంది ఇబ్బంది పెట్టారు. అయితే వారితో నేను చాలా దురుసుగా ప్రవర్తించేదాన్ని. అంతేకాదు అలాంటి వారి వల్ల నేను ఉద్యోగాన్ని కూడా కోల్పోయాను అంటూ తెలిపింది మంచు లక్ష్మి.

- Advertisement -

జూనియర్ వైద్యురాలి హత్యాచారం పై స్పందన..

అంతేకాదు ఇటీవల కోల్కతాలో జూనియర్ వైద్యురాలి పై జరిగిన అత్యాచారాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. ఈ ఘటన గురించి విన్న తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. మనకు ప్రాణం పోసే వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను విచక్షణ రహితంగా హత్య చేయడం చాలా బాధాకరం. అసలు ఈ సమాజంలో ఏం జరుగుతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది మంచు లక్ష్మి. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రతి అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని, అన్ని రంగాలలో కూడా తనకంటూ ఒక నాలెడ్జ్ పెంచుకోవాలని, ఒకటి కాకపోతే ఇంకొకటి అనే ధోరణిలోనే మహిళలు ముందుకు వెళ్లాలని మంచు లక్ష్మి పిలుపునిచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు