Orange: ఆరెంజ్ మూవీ హీరోయిన్ ఏమైపోయింది..వెలుగులోకి షాకింగ్‌ విషయాలు!

Orange: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమాలలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న వాటిలో ఆరెంజ్ (Orange) సినిమా ఒకటి. ఈ సినిమా మొదట ప్రేక్షకులను థియేటర్స్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత టీవీలలో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) నటన, సినిమా స్టోరీ ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.

ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. ఈ సినిమాలో ఉన్నటువంటి పాటలు ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జెనీలియా, షాజన్ పదంసీ హీరోయిన్లుగా నటించారు. జెనీలియా మెయిన్ హీరోయిన్ గా నటించింది. సెకండ్ హీరోయిన్ గా షాజన్ పదంసీ నటించింది. మొదట జెనీలియాతో ప్రేమలో పడిన రామ్ చరణ్ ఆ తర్వాత షాజన్ పదంసీతో (Shazahn Padamsee) ప్రేమాయణం నడిపిస్తాడు.

ఈ సినిమాలో షాజన్ పదంసీ రూబ పాత్రలో మెప్పించింది. ఈ అమ్మడు ఆరెంజ్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. తన అందానికి, నటనకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మొదట షాజన్ పదంసీ (Shazahn Padamsee) హిందీలో సినిమాలు చేసింది. ఆ తర్వాత తమిళంలో నటించింది. ఇక తెలుగులో ఆరం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

- Advertisement -

Shazahn Padamsee
ఆరెంజ్ సినిమా తర్వాత ఈ బ్యూటీ ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. మసాలా సినిమాలో నటించినప్పటికీ ప్రేక్షకుల పెద్దగా ఆదరించలేకపోయారు. దీంతో షాజన్ పదంసీ కొన్నేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రేక్షకులు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే షాజన్ పదంసీకి సంబంధించిన కొన్ని ఫోటోలు లభించాయి. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు