Deepika Padukone.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే (Deepika Padukone) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇటీవలే తెలుగులో తొలిసారి కల్కి 2898 ఏడి (Kalki 2898AD) సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న దీపికా పదుకొనే, తన అద్భుతమైన నటనతో ,అందంతో యువతను ఆకట్టుకోవడమే కాదు అంతకుమించి ప్రతిభా కారణంగా ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకుంది. వివాహం జరిగిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత గర్భం దాల్చింది ఈ ముద్దుగుమ్మ. సెప్టెంబర్ నెలలో పండంటి బిడ్డకు కూడా జన్మనివ్వబోతోంది.
రెండేళ్లు ఇండస్ట్రీకి దూరం..
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దాదాపు రెండు సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరం కానుంది అని సమాచారం. బిడ్డ కోసం కేర్ టేకర్ ను నియమించకుండా తానే స్వయంగా బిడ్డ ఆలనా పాలన చూసుకోవాలని నిర్ణయించుకుందట. అందుకే రెండు సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరం కాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఈమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో కల్కి 2898AD సీక్వెల్ కూడా వాయిదా పడిబోతోందని సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. ఇక వారు వీరే కాదు తాను కూడా 15 సంవత్సరాలకే వేధింపులు ఎదుర్కొన్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
15 సంవత్సరాలకే వేధింపులు ఎదుర్కొన్నా..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక తన 15 సంవత్సరాల వయసులో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. దీపిక మాట్లాడుతూ.. మేము ఒక రెస్టారెంట్ లో తినడానికి వెళ్ళాము. అక్కడ మా చెల్లి, నాన్న ముందుకు వెళ్తున్నారు .నేను అమ్మ కలిసి వెళ్తున్నాము. ఆ సమయంలో అప్పుడు ఒక అబ్బాయి వచ్చి నన్ను వెనక్కి నుంచి నెట్టాడు .అయితే అదొక కలలాగా జరిగిపోయింది. మళ్లీ టచ్ చేయాలని చూశాడు. దాంతో నేను తిరగబడ్డాను. అయితే ఆ వ్యక్తి పరుగు పెట్టడం మొదలుపెట్టాడు. నేను అతడిని అనుసరించి నడివీధిలో అతడి కాలర్ పట్టుకుని కొట్టాను అంటూ చెప్పుకొచ్చింది దీపిక. అయితే 15 సంవత్సరాల వయసులో తాను అలాంటి దాడికి ప్రతి దాడి చేసి తనను తాను సేవ్ చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది దీపిక. ప్రస్తుతం దీపిక షేర్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సెప్టెంబర్ లో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న దీపిక ..
ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడి చిత్రంలో గర్భవతి గానే నటించింది దీపికా పదుకొనే. వాస్తవానికి ఆమె గర్భవతి కానీ ఆమె గర్భవతి అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని.. నాగ్ అశ్విన్ చాలా అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైన అతి తక్కువ సమయంలోనే రూ 1200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి మంచి విజయాన్ని అందించింది.సెప్టెంబర్ లో ఈమె తమ మొదటి బిడ్డను స్వాగతించనున్నారు. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భవతి.