Thandel : భారీ సెట్లో జాతర సాంగ్ షూట్… చందు మొండేటి ప్లాన్ వేరే లెవెల్!

Thandel : అక్కినేని నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి కాంబినేషన్ లో “తండేల్” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి (Sai pallavi) ఈ సినిమాలో చైతన్య కి జోడీగా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంతకు ముందు లవ్ స్టోరీ అనే బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. ఇప్పుడు రెండో సారి ఈ కాంబోలో మూవీ వస్తుండడంతో ఫ్యాన్స్ లో క్రేజీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్ సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ మూవీలో కంటెంట్ ఏదో బలంగా ఉంటుందనే అభిప్రాయం జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇక ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 85 శాతం పూర్తి చేసేయగా, తాజాగా తండేల్ షూటింగ్ కి సంబంధించి మరో అప్డేట్ వచ్చింది.

Huge song set in Hyderabad for Thandel movie

సెట్లో భారీ సాంగ్ షూట్..

ఇక తండేల్ (Thandel) లో ఓ సాంగ్ షూట్ కోసం హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లో ఓ భారీ సెట్ వేశారు మేకర్స్. ఆ సెట్స్ లో మహా శివుడి విగ్రహం సెట్ హైలెట్ గా ఉంటుందని సమాచారం. ఇక ఈ సెట్ ఒక జాతర సెట్ అని, దీంట్లో కీలక సన్నివేశాలతో పాటు, అదిరిపోయే పాటను షూట్ చేసారని సమాచారం. ఆ సాంగ్ లో చై (Naga chaitanya) – సాయిపల్లవి ల మాస్ డ్యాన్స్ ఫీట్ ఉంటుందని సమాచారం. ఈ పాట తండేల్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. ఇక ఈ సాంగ్ కి సంబంధించిన కొన్ని షాట్స్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ అవుతున్నాయి. ఇక తండేల్ కి సంబంధించి మరో నెలరోజుల షూట్ బాకీ ఉందని సమాచారం.

- Advertisement -

డిసెంబర్ లో వస్తారా?

ఇక తండేల్ సినిమా నిజానికి సమ్మర్ లో రిలీజ్ కావాల్సి ఉండగా, షూటింగ్ డిలే కారణంగా వాయిదా వేశారు. ఆ తర్వాత ఆగష్టు 15కి అనుకున్నా కుదరలేదు. ఫైనల్ గా ఇప్పుడు డిసెంబర్ లో వస్తామని అంటున్నారు. అయితే తండేల్ విడుదల పుష్ప2 పైనే ఆధారపడి ఉంది. పుష్ప2 వాయిదా పడితే ఆ డేట్ కి తండేల్ వచ్చే అవకాశం ఉందని నిర్మాత బన్నీ వాసు చెప్పారు. ఒకవేళ అది కుదరకపోతే ఫిబ్రవరిలో వచ్చే ఛాన్స్ ఉంది. ఇక తండేల్ సినిమా బడ్జెట్ బడ్జెట్ ఇప్పటికే 80 కోట్లు దాటిపోయి వంద కోట్లు అయ్యే ఛాన్స్ ఉందట. మరి తండేల్ నుండి నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు