Kiran Abbavaram – Rahasya Gorak: మూడుముళ్లతో ఒక్కటైన జంట.. వీడియో వైరల్..!

Kiran Abbavaram – Rahasya Gorak.. ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)తాజాగా ఒక ఇంటి వారు అయ్యారు.. తన ప్రియురాలు రహస్య గోరఖ్ (Rahasya Gorak)తో ఏడు అడుగులు వేశారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట దాదాపు 5 సంవత్సరాల పాటు తమ ప్రేమను కొనసాగించారు. ఆగస్టు 22న మూడుముళ్ల బంధం లోకి అడుగుపెట్టారు. ఇరువురి కుటుంబ సభ్యులు, పెద్దలు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో రహస్య మెడలో మూడు ముళ్ళు వేశారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Kiran Abbavaram - Rahasya Gorak: A couple with three teeth.. Video viral..!
Kiran Abbavaram – Rahasya Gorak: A couple with three teeth.. Video viral..!

పెళ్లి బట్టల్లో లక్ష్మీనారాయణులుగా కొత్తజంట..

పెళ్లి బట్టల్లో శ్రీలక్ష్మి నారాయణుల లా అత్యంత సుందరంగా కనిపించింది ఈ జంట. రహస్య గోరక్ పెళ్లి దుస్తుల్లో లక్ష్మీదేవిలా కలకలలాడిపోయింది. ముఖ్యంగా ఆమె ఎంట్రీ, పెళ్లి పీటల మీద కూర్చున్న తర్వాత జీలకర్ర బెల్లం, కిరణ్ అబ్బవరం ఆమె మెడలో తాళి కడుతున్న వీడియో ఇలా ప్రతి వీడియోని కూడా నెట్టింట షేర్ చేశారు సన్నిహితులు. ప్రముఖులు, అభిమానులు, నెటిజనులు కూడా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కర్ణాటకలోని కూర్గ్ లో ఉన్న ఒక ప్రైవేటు హోటల్లో వీరు వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో సందడి చేసిన జంట..

ఇంతకుముందు గత మూడు రోజులుగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్న ఈ జంట సంగీత్ , హల్దీ, మెహందీ ఇలా అన్ని కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను , వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. మొత్తానికి అయితే ఐదు సంవత్సరాల పాటు ప్రేమించుకున్న ఈ జంట ఇప్పుడు మూడుముళ్ల బంధంతో తమ జీవితంలో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు అని చెప్పవచ్చు.

- Advertisement -

ఇండస్ట్రీ లోకి రాక మునుపు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా..

ఇకపోతే 2019 నవంబర్లో విడుదలైన రాజా వారు రాణి గారు సినిమా షూటింగ్లో రహస్య , కిరణ్ ఒకరికొకరు ప్రేమించుకున్నారు. అంతకుముందు వీరిద్దరూ ఇండస్ట్రీలోకి రాకమునపు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేశారు. కానీ నటన మీద మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే ప్రేమికులుగా మారిన ఈ జంట ఇప్పుడు నిజ జీవితంలో లవర్లుగా మారి.. దాదాపు చాలా సంవత్సరాల పాటు తమ ప్రేమను రహస్యంగా ఉంచారు.

నిశ్చితార్థ ప్రకటనతో ప్రేమ విషయం రివీల్..

ఇటీవలే తమ ప్రేమను ప్రకటించడమే కాదు తమ నిశ్చితార్థాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు. నిశ్చితార్థ ప్రకటనతో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించి , మార్చి 13న నిశ్చితార్ధాన్ని చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. ఇప్పుడు పెళ్లితో తమ ప్రేమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు ఈ ప్రేమ జంట. మొత్తానికి. అయితే కిరణ్ అబ్బవరం రహస్య మూడు ముళ్ళు , ఏడడుగులతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారని చెప్పవచ్చు.

కిరణ్ అబ్బవరం సినిమాలు.

కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం క అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటారనుకున్నారు. కానీ ముహూర్త బలాలు లేకపోవడం కారణంగానే శ్రావణమాసంలో ఈ జంట ఒకటి కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు