Megha akash: రూమర్స్ ని నిజం చేసి ఎంగేజ్మెంట్ చేసుకున్న నితిన్ హీరోయిన్..!

Megha akash..ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు రూమర్స్ ను సైతం నిజం చేస్తూ వివాహాలు, ఎంగేజ్మెంట్ వంటివి చేసుకుంటూ ఉంటున్నారు. ఇటీవలే నాగచైతన్య,శోభిత ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. గతంలో కూడా వీరి మీద చాలానే రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు తాజాగా హీరోయిన్ మేఘా ఆకాష్ కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా చూద్దాం.

Megha akash: Nitin's heroine who got engaged made the rumor true..!
Megha akash: Nitin’s heroine who got engaged made the rumor true..!

మేఘా ఆకాష్ కెరియర్..

మేఘా ఆకాష్ విషయానికి వస్తే, చెన్నైలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ హీరో నితిన్ నటించిన లై సినిమాతో మొదటిసారిగా హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ తర్వాతే మళ్లీ చల్ మోహన్ రంగా అనే సినిమాతో నితిన్ సరసన నటించింది. ఈ రెండు చిత్రాలు పరవాలేదు అనిపించుకున్నాయి. ఇక ఆ వెంటనే రాజరాజ చోర, ప్రేమదేశం, రావణాసుర, డియర్ మేఘ, గుర్తుందా శీతాకాలం.. తమిళంలో రజనీకాంత్ నటించిన పేటా అనే చిత్రంలో నటించింది. కానీ తన కెరియర్ లో సక్సెస్ కంటే ఫ్లాప్ లు ఎక్కువగా మిగిలిపోయాయి.

త్వరలో మేఘా ఆకాష్ పెళ్లి

గత కొన్ని నెలలుగా మేఘా ఆకాష్ పెళ్లి గురించి పలు రకాల రూమర్స్ అయితే ఎక్కువగా వినిపించాయి. తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ రాజకీయ కుమారుడితో వివాహం జరగబోతుందని రూమర్స్ అయితే వినిపించాయి. ఇప్పుడు తాజాగా సాయి విష్ణు అనే కుర్రాడితో ఎలాంటి హడావిడి లేకుండా ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే మేఘా ఆకాష్ వివాహం చేసుకోబోతున్న వరుడు ఎవరు ?అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటనే విషయం మాత్రం తెలియజేయలేదు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం అన్నట్లుగా మేఘ ఆకాష్ తెలియజేసింది.

- Advertisement -

ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్..

సోషల్ మీడియా వేదికగా ఎట్టకేలకు నా కల నిజమయింది అంటూ ఒక ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే వివాహ తేదీ విషయాన్ని మాత్రం ఇంకా తెలియజేయలేదు. మరి వివాహమైన తర్వాత కూడా మేఘా ఆకాష్ సినిమాలలో నటించే అవకాశం ఉందో లేదో చూడాలి మరి. మేఘా ఆకాశ్ నటించిన సకుటుంబానా సినిమా త్వరలోనే రిలీజ్ కు సిద్ధంగా ఉన్నది.

మేఘా ఆకాశ్ కెరియర్..

తెలుగు , తమిళ్ చిత్రాలలో నటించిన తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ లై అని తెలుగు చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై కుర్రాళ్ళ మనసు దోచుకుంది. చెన్నైలో పుట్టిన చిన్నది మహిళా క్రిస్టియన్ కాలేజ్ లేడీ అండ్ కళాశాలలో తన విద్యను పూర్తి చేసింది. తన అందంతో నటనతో యువతను ఉర్రూతలూగించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకొని యువత గుండెలను బ్రేక్ చేసిందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని తెలిసి అభిమానుల సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు

 

View this post on Instagram

 

A post shared by Megha Akash (@meghaakash)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు