Kiran Abbavaram – Rahasya : కిరణ్ అబ్బవరం భార్య రహస్య ఏ జాబ్ చేసిందో తెలుసా?

Kiran Abbavaram – Rahasya : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ల పెళ్లి తంతు ముగిసింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా పెళ్లి జరిగింది.. వీరి పెళ్లికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. వీరిద్దరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మొదటి సినిమాతోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న హీరో రహస్యని వివాహం చేసుకున్నాడు. తాజాగా రహస్య హీరోయిన్ కాకముందు ఏం ఉద్యోగం చేసేదో అనే వార్త సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది..

తెలుగులో ‘రాజావారు రాణిగారు’ అనే చిత్రంతో కిరణ్ హీరోగా పరిచయం కాగా, అందులో హీరోయిన్ గా నటించిన రహస్య గోరఖ్‌తో ప్రేమలో పడ్డాడు.. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. పెళ్లి బట్టల్లో వీరిద్దరూ చాలా క్యూట్ గా ఉన్నారు. కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా హీరోయిన్ నే తన జీవిత భాగస్వామిని చేసుకున్నాడు. వీళ్లిద్దరి పెళ్లి వేడుక గురువారం రోజు కర్ణాటక లోని కూర్గ్ లో అట్టహాసంగా జరిగింది. పెళ్లి వేడుకకి సంబంధించిన కొన్ని వీడియోలు బయటకి రాగా వాటిని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. నూతన జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కిరణ్ అబ్బవరం, రహస్య వధూవరులుగా ముస్తాబై పెళ్లి మండపానికి తీసుకెళ్లడం, బంధు మిత్రులు వారిని సాంప్రదాయ పద్దతిలో మండపం వద్దకు తీసుకురావడం వంటి సన్నివేశాలు వీడియోలో ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా కిరణ్ అబ్బవరం భార్య గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే.. రహస్య గతంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసిందట…ఆ తర్వాత జాబ్ మానేసి సినిమాల్లోకి వచ్చేసిందట. ఇక ఈమె గురించి కొద్ది రోజుల ముందు పెద్దగా ఎవ్వరికి తెలియదు. కానీ కిరణ్ అబ్బవరంతో పెళ్లి నేపథ్యంలో రహస్య గోరఖ్ కు సంబంధించిన ఏ చిన్న విషయమైనా నెట్టింట ట్రెండ్ అవుతోంది. అలాగే తన చిన్ననాటి ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
Do you know the secret job of Kiran Abbavaram's wife?
Do you know the secret job of Kiran Abbavaram’s wife?

ఇదిలా ఉండగా.. కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లే. అయితే సినిమాలపై ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ‘రాజావారు రాణిగారు’ మూవీతో హీరో, హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. ఫస్ట్ మూవీతోనే అందమైన జోడీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు నిజ జీవితంలోనూ వీరు జంటగా మారనున్నాడు. దాదాపు ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న కిరణ్, రహస్య గోరఖ్ మార్చి 13న వీరి నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు ప్రేమతో తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు.. తాజాగా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఇక వీరు హనీమూన్ కోసం ఫారీస్ వెళ్లానున్నారని సమాచారం.. అంతకన్నా ముందు టాలీవుడ్ సెలెబ్రేటీల కోసం గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ కలిసి సినిమాలు చెయ్యనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం “క” అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు