IndraReRelease Collections : ఇంద్రసేనుడి ప్రభంజనం.. నాలుగు చోట్ల ఆల్ టైం రికార్డ్స్ తో రచ్చ…

IndraReRelease Collections : టాలీవుడ్ లో మరోసారి ఇంద్రసేనుడి ప్రభంజనం మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ “ఇంద్ర” మూవీ తన బర్త్ డే కానుకగా ఆగష్టు 22న థియేటర్లలో రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మెగాభిమానులు ఎన్నో రోజులుగా ఈ రీ రిలీజ్ కోసం ఎదురుచూస్తుండగా ఎట్టకేలకు నిన్న రీ రిలీజ్ అయింది. ఇక రిలీజ్ కి ముందు రోజునుండి కొన్ని థియేటర్లలో మెగా జాతర మొదలవగా, ఇంద్రసేనుడి మాస్ అప్పీరెన్స్ కి మరోసారి మెగాభిమానులు, మూవీ లవర్స్ ఫిదా అయిపోయారు. మెగాఫ్యాన్స్ సీనియర్ ఫ్యాన్స్ కూడా ఎంతో మంది ఇంద్ర కోసం మళ్ళీ వచ్చారు. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా వీణ స్టెప్పులతో మార్మోగించారు. ఇక ఇంద్ర సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వరల్డ్ వైడ్ గా అన్ని చోట్ల కలెక్షన్ల భీభత్సమైన కలెక్షన్లు సాధించింది.

Indra Movie ReRelease First day Collections

నాలుగు చోట్ల అల్ టైం రికార్డులు..

ఇక ఇంద్ర సినిమా వరల్డ్ వైడ్ గా 385 స్క్రీన్ లలో రిలీజ్ అవగా, లిమిటెడ్ స్క్రీన్స్ అయినా హౌస్ ఫుల్ కలెక్షన్లతో రచ్చ చేసింది. ఇక కర్ణాటక, చెన్నై, యుకె, యూఎస్ఏ, ఈ నాలుగు ఏరియాల్లో ఇంద్ర సినిమా అల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ తో రచ్చ చేసిందని సమాచారం. అన్నిటికి మించి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 13 షోలతో హౌస్ ఫుల్ కలెక్షన్లు రాబట్టి ఇంద్ర సినిమా ఏకంగా 19 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేయడం విశేషం. సీనియర్ స్టార్స్ లో అల్ టైం రికార్డ్ ఇది. ఇక తెలుగు రాష్ట్రాలలో రెండు రోజుల ముందే కోటిన్నరకి పైగా బుకింగ్స్ ని సొంతం చేసుకోగా, రీ రిలీజ్ లో సంచలన రికార్డులు నమోదు చేసింది.

- Advertisement -

ఇంద్రసేనుడి ప్రభంజనం.. కొత్త రికార్డులు నమోదు…

ఇక ఇంద్ర ఫస్ట్ డే కేవలం తెలుగు రాష్ట్రాలలోనే 2 కోట్లకి పైగా గ్రాస్ అందుకుందని సమాచారం. సీనియర్స్ స్టార్స్ లో హైయెస్ట్ ఇది. ఇక చెన్నైలో అల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ అందుకున్న ఇంద్ర అక్కడ 20 లక్షల గ్రాస్ వసూలు చేసిందట. ఇక బెంగుళూరు లో ఏడాదిగా ఉన్న బిజినెస్ మెన్ (27లక్షలు) రికార్డ్ బ్రేక్ చేసి ఇంద్ర 32 లక్షలకు పైగా వసూలు చేసి అల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా ఓవర్సీస్ లో ఉన్న ఏడాదిగా సింహాద్రి (58K) రికార్డ్స్ ని బ్రేక్ చేసి, అల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది ఇంద్ర. అక్కడ ఇంద్ర ఏకంగా 61K డాలర్స్ వసూలు చేయడం విశేషం. మొత్తంగా తొలిరోజు ఇంద్ర సినిమా వరల్డ్ వైడ్ గా 3.15 కోట్ల వరకు వసూలు చేసిందని సమాచారం. ఇది సీనియర్ స్టార్ హీరోలలో అల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ కాగా, ఓవరాల్ గా రీ రిలీజ్ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న 4వ సినిమాగా నిలిచిందని సమాచారం. ఇక రెండో రోజు కూడా ఇంద్ర మంచి హోల్డ్ చూపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు