Prabhas – Maruthi: సైలెంట్ గా వస్తాం.. అదే టార్గెట్.. నిర్మాత కామెంట్స్ వైరల్..!

Prabhas – Maruthi.. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. కథల ఎంపిక విషయంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు ప్రభాస్. ఇదిలా ఉండగా ప్రభాస్ సంతకం చేసిన చిత్రాలలో డైరెక్టర్ మారుతి తో సినిమా అనగానే చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ కథ బాగుంటే డైరెక్టర్ ఎవరైనా సరే ప్రభాస్ ప్రోత్సహిస్తారని మరొకసారి నిరూపించుకున్నారు. వీరి కాంబినేషన్లో రాజా సాబ్ అనే సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి నిర్మాతగా టీజీ విశ్వప్రసాద్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈయన రాజాసాబ్ సినిమా పైన పలు విషయాలు తెలియజేశారు.

Prabhas - Maruthi: We will come silently.. Same target.. Producer's comments viral..!
Prabhas – Maruthi: We will come silently.. Same target.. Producer’s comments viral..!

సైలెంట్ గా వచ్చి హిట్ కొడతాం..

టీజీ విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్ నటించిన సినిమాలన్నిటికీ కూడా మించి ఈ సినిమా సైలెంట్ గా విజయాన్ని అందుకుంటుందని , అది కూడా పెద్ద హిట్ అవుతుందని కూడా తెలియజేశారు టీజీ విశ్వప్రసాద్. రాజా సాబ్ సినిమా షూటింగ్ సైలెంట్ గానే జరుగుతోందని..38,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సినిమా షూటింగ్ సెట్టింగ్ వేసాము.ఇంత పెద్ద సినిమా షూట్ ఇండియాలోనే ఏ చిత్రానికి వేయలేదని తెలిపారు. పాటలు కూడా మరొక స్థాయిలో అలరిస్తాయని టీజీ విశ్వప్రసాద్ తెలియజేశారు. ఈ సినిమా పైన తాము చాలా కాన్ఫిడెంట్ గానే ఉన్నామని, సైలెంట్ గా వచ్చి బ్లాక్ బాస్టర్ కొడతామంటూ తెలియజేశారు.

రాజా సాబ్ సినిమాతో మరో రికార్డ్..

రాజా సాబ్ సినిమాని మొదలుపెట్టేటప్పుడు ప్రభాస్ నటించిన పెద్దపెద్ద చిత్రాలు లైన్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా తమ సినిమా షూటింగ్ సైలెంట్ గానే జరిగింది. ఇందులో రొమాంటిక్ , హర్రర్ , యాక్షన్ ఇలా అభిమానులకు కావలసిన అన్ని ఎలివేషన్స్ రాజాసాబ్ లో కచ్చితంగా ఉంటాయని తెలియజేశారు. ఇందులో నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి లీకులు కూడా అప్పుడప్పుడు వైరల్ గా మారుతూ ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు..

- Advertisement -

రాజా సాబ్ లో భారీ తారాగణం..

రాజా సాబ్ సినిమాలో కీలకమైన పాత్రలలో రిద్ది కుమార్, బ్రహ్మానందం, యోగిబాబు, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కూడా అన్ని భాషలలో వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేసే విధంగా చూస్తోంది చిత్ర బృందం. ఈ చిత్రానికి సంగీతాన్ని తమన్ అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ లో కూడా ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించడమే కాకుండా అందరిని ఆకట్టుకునేలా లవర్ బాయ్ గా కూడా కనిపించారు. ముఖ్యంగా పాత ప్రభాస్ ని చూపించబోతున్నారు అంటూ అభిమానులు సైతం తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా వచ్చి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటామని నిర్మాత స్పష్టం చేశారు. మరి ప్రభాస్ కి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు