Nani: అలాంటి జోనర్స్ టచ్ చేసి తెలుగులో పదేళ్లు అయింది

Nani: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త దర్శకులను ఎంకరేజ్ చేసే హీరో అంటే నాని అని చెప్పాలి. బాపు గారి దగ్గర రాధాగోపాలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన నాని అష్ట చమ్మ సినిమాతో ఒక నటుడుగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఒక సొంత గుర్తింపును సాధించుకున్నాడు. ఇక రీసెంట్ టైమ్స్ లో నాని చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తున్నాయి. ప్రస్తుతం నాని రేంజ్ వేరే లెవెల్ లో ఉంది అని చెప్పాలి. వైపు కమర్షియల్ గా హిట్స్ అందుకుంటూ డెబ్యూ డైరెక్టర్స్ కి అవార్డ్స్ కూడా తెప్పిస్తున్నాడు.

ఇకపోతే నాని రీసెంట్ టైమ్స్ లో శ్రీకాంత్ ఓదెల, శౌర్యవను దర్శకులుగా పరిచయం చేశాడు. వీరిద్దరూ బెస్ట్ డైరెక్టర్స్ గా అవార్డ్స్ కూడా అందుకున్నారు. ఇకపోతే శౌర్యవ్ దర్శకత్వం వహించిన హాయ్ నాన్న సినిమా గురించి ఒక ఆసక్తికర విషయాన్ని రివిల్ చేశాడు నాని. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేద్దామని మొదట అనుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ సినిమా రిలీజ్ కి అనౌన్స్ చేశారు. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వారిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని అంటేనే అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఆ తరుణంలో హాయ్ నాన్న సినిమా పూర్తయిపోవటం వలన కొంచెం ముందుగా రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు.

Hi Nanna

- Advertisement -

అయితే ఈ సినిమాని మొదట డిసెంబర్ 8వ తారీఖున రిలీజ్ చేద్దామని అందరూ అనుకున్నారు. అప్పుడు నాని డిసెంబర్ 7న రిలీజ్ చేద్దాం అని చెప్పారట. అయితే డిసెంబర్ 7 అంటే కొంతమందికి చూసే అవకాశం తక్కువగా ఉంటుంది సరైన ఓపెనింగ్స్ రావు అని అందరూ మాట్లాడారట. అప్పుడు నాని మాట్లాడుతూ మీరు ఓపెనింగ్స్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు.? సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తే చాలా మంది దాని గురించి గొప్పగా మాట్లాడుకుని ఎక్కువమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది అని క్లారిటీగా చెప్పాడు. పైగా ఈ జోనర్ లో సినిమా వచ్చి దాదాపు 10 ఏళ్ళు అయింది. ఈ కైండ్ ఆఫ్ ఆడియన్స్ థియేటర్ కి రావడం మానేశారు. అటువంటి ఆడియన్స్ ను తీసుకొచ్చే ప్రయత్నం కూడా మనమే చేయాలి అని చెప్పాడంట నాని.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు