Sobhita: చైతూ తో పెళ్లి.. శోభిత కుటుంబానికి ఇష్టం లేదా.. కట్ చేస్తే..!

Sobhita.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ యంగ్ బ్యూటీ శోభిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తెలుగమ్మాయి అయినప్పటికీ కూడా బాలీవుడ్ లో అవకాశాలు అందుకుని బాలీవుడ్ హీరోయిన్ గా చలామణి అయింది. ఇకపోతే ఇటీవల అక్కినేని హీరో నాగచైతన్యతో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఇటీవల నిశ్చితార్థంతో పెళ్లి బంధంలోకి త్వరలోనే అడుగుపెట్టబోతున్నారు. నిజానికి ఏడేళ్ల పాటు ప్రేమించి, 2017లో సమంతను వివాహం చేసుకున్న నాగచైతన్య నాలుగేళ్లకే ఆమెకు విడాకులు ఇచ్చేశారు. తర్వాత శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. సమంతతో విడాకులు జరిగిన వెంటనే చైతన్య శోభిత ప్రేమలో పడ్డారనే వార్తలు వైరల్ అయ్యాయి.

Sobhita: Marriage with Chaitu.. Sobhita's family doesn't like it.. If it is cut..!
Sobhita: Marriage with Chaitu.. Sobhita’s family doesn’t like it.. If it is cut..!

చైతూ తో నిశ్చితార్థం..శోభిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేదా..

దీనికి తోడు నిశ్చితార్థం తర్వాత రకరకాల రూమర్లు కూడా తెర పైకి వచ్చాయి.ఇకపోతే ఈనెల 8వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో నాగార్జున ఇంట్లో శోభిత నాగచైతన్య నిశ్చితార్థం చాలా రహస్యంగా జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు నాగార్జున తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఫోటోలను షేర్ చేస్తూ.. అసలు విషయాన్ని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరొక వార్త తెరపైకి వచ్చింది.నాగచైతన్యను పెళ్లి చేసుకోవడం శోభిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, కానీ కూతురు కోసం నిశ్చితార్థ వేడుకల్లో కనిపించారు అని, ముఖ్యంగా నాగచైతన్య – శోభిత పెళ్లికి ఒక స్టార్ హీరో కారణం అంటూ కొన్ని వార్తలు తెరపైకి వచ్చాయి.

నాగార్జున ఒప్పించి మరీ నిశ్చితార్థం..

ఈ వివాహ రూమర్స్ పై అక్కినేని ఫ్యామిలీ స్పందించింది. వీరిద్దరికీ తగిన ముహూర్తం కావడంతో దానిని వదులుకోకూడదని, చాలా హడావిడిగా నిశ్చితార్థం జరిపించినట్లు అక్కినేని కుటుంబం వెల్లడించింది. అయితే ఈ పెళ్లికి శోభితను వారి కుటుంబ సభ్యులను దగ్గరుండి మరీ నాగార్జున ఒప్పించారట. నిశ్చితార్థం అంత త్వరగా వద్దు , ఇంకా కొన్ని రోజులు ఎదురు చూద్దామని శోభిత, ఆమె కుటుంబ సభ్యులు చెప్పారట. కానీ మంచి ముహూర్తం అని హడావిడి చేసి నాగార్జున బలవంతంగా శోభిత కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ నిశ్చితార్థం జరిపించినట్లు సమాచారం. అంతేకాదు ఇలాంటి మంచి ముహూర్తం మళ్ళీ రాదని, ఇలాంటి ముహూర్తం కోసం కొన్ని సంవత్సరాలు ఎదురు చూడాలని శోభిత కుటుంబ సభ్యులను ఒప్పించారట.

- Advertisement -

సమంత సంగతేంటి..

ఇక తర్వాత ఆగస్టు 8వ తేదీన హుటాహుటిన వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్లు సమాచారం. అయితే వివాహానికి ఇంకా కొన్ని రోజులపాటు గ్యాప్ తీసుకుంటామని నాగచైతన్య , శోభిత తరపున నాగార్జున వెల్లడించిన విషయం తెలిసిందే. మరి వీరి వివాహం ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే శోభిత కుటుంబ సభ్యులను ఒప్పించి మరి నిశ్చితార్థం జరిపించారు అంటూ వస్తున్న వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే మరొకవైపు సమంత ఒంటరిగా కెరియర్ ను కొనసాగిస్తోంది. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత మళ్లీ పెళ్లి ఊసు ఎత్తడం లేదు ఈ ముద్దుగుమ్మ. ఇక మళ్ళీ పెళ్లి విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు