Manchu Vishnu.. ప్రభాస్ పై కారు కూతలు కూసిన అర్షద్ వార్సి.. ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఘాటు గా లేఖ..!

Manchu Vishnu.. ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి.. కల్కి సినిమా విడుదలైన సమయంలో ఈ సినిమాలో ప్రభాస్ లుక్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన అలాంటి కామెంట్లు చేయడంతో ఈ విషయం కాస్త ఒక్కసారిగా గుప్పుమంది. ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీలు కూడా ఒక్కొక్కరిగా అర్షద్ వార్శి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఒక స్టార్ సెలబ్రిటీ అయ్యుండి ఇంకో స్టార్ సెలబ్రిటీ పై ఇలాంటి కారు కూతలు కూయడం పద్ధతి కాదు అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అభిమానులైతే ఏకంగా మండిపాటుకు గురవుతున్నారు.

Manchu Vishnu.. Arshad Warsi who crashed his car on Prabhas.. Harsh letter to artist association..!
Manchu Vishnu.. Arshad Warsi who crashed his car on Prabhas.. Harsh letter to artist association..!

సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఘాటుగా లేఖ..

అయితే తాజాగా ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఘాటుగా లేఖ రాశారు. ప్రభాస్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి పై చర్యలు తీసుకోవాలని, ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు అభిమానులను పూర్తిస్థాయిలో మనస్థాపానికి గురిచేసాయని వెల్లడించారు. తాజాగా మంచు విష్ణు రాసిన ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.

లేఖలో ఏముందంటే..

గౌరవనీయులైన శ్రీమతి పూనమ్ థిల్లాన్.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా తెలుగు సినీ వర్గాలలో గణనీయమైన ఆందోళన కలిగించిన ఒక విషయాన్ని మేము మీ దృష్టికి తీసుకురావాలని ఈ లేఖ రాస్తున్నాము. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అర్షద్ వార్సి రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి లుక్కు పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిజానికి ప్రతి వ్యక్తికి కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంటుంది. దానిని మేము గౌరవించడమే కాదు అంగీకరిస్తాము కూడా.. అయితే ప్రభాస్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రభాస్ ను కించపరిచేలా వున్నాయి. దానికి మేము విచారిస్తున్నాము. ఈయన చేసిన వ్యాఖ్యల వల్ల తెలుగు సినీ వర్గాలలో అభిమానులలో అసంతృప్తికి దారితీసాయి. ముఖ్యంగా ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల తెలుగు తమ్ముళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయి.

- Advertisement -

మాట బంధాన్ని నిలపడమే కాదు విడగొడుతుంది కూడా..

సినిమా ఇండస్ట్రీలో గౌరవం కోసం ఐక్యమత్యం కోసం ఎప్పుడు నిలబడే సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా చూసుకుంటుందని నేను విశ్వసిస్తున్నాను. అంతేకాదు భవిష్యత్తులో తోటి నటీనటుల గురించి అర్షద్ వార్సి ఇలాంటి కామెంట్లు చేయకుండా తగు చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను. మాట బంధాన్ని నిలపడమే కాదు విడగొడుతుంది కూడా.. అందుకే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను.ముఖ్యంగా ప్రాంతీయ అనుబంధంతో సంబంధం లేకుండా సహ ఉద్యోగులతో ప్రతి ఒక్కరికి దక్కాల్సిన గౌరవాన్ని మనం కాపాడడం చాలా అవసరం. మనమందరం సినిమా అనే ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చామ. మనం మన పట్ల ఒకరికొకరు గౌరవ మర్యాదలతో నడుచుకోవాలి. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు ఇంకెవరిపైనా లేదా ఇంకెవరు కూడా చేయకుండా చూసుకోవాలని కోరుతున్నాను అంటూ తన లేఖను పంచుకున్నారు మంచు విష్ణు. ప్రస్తుతం ఈ లేఖ కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు