Vijay Devarakonda : తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు ఒకరి సినిమాల్లో మరొకరు గెస్టుగా ఎంట్రీ ఇస్తారు. ఇక కొంతమంది ఆ సినిమాల్లో వాయిస్ ను ఇస్తారు. స్టార్ హీరోల వాయిస్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు అన్ని మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు మరో సినిమా లో ఒకరు కాదు ఇద్దరు స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారని సమాచారం.. అది కూడా ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన హీరోలే కావడం విశేషం.. ఏ హీరో సినిమాలో వాయిస్ ఓవర్ ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలుగు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) రీసెంట్ గా కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఓ మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఆ సినిమాలు అన్ని షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటున్నాయి. అయితే ఇందులో VD12 సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అయితే సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కాబోతుంది. అయితే ఈ సినిమా కోసం ఇద్దరు స్టార్ హీరోలు పనిచేయబోతున్నట్లు సమాచారం..
ఈ సినిమాలో నందమూరి హీరోలతో వాయిస్ ఓవర్ ను చెప్పించాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్.. నందమూరి బాలయ్య( Balaya ), ఎన్టీఆర్ ( Ntr) తో ఇంట్రడ్యూస్ వాయిస్ ను చెప్పించాలని మేకర్స్ భావిస్తున్నారు.. ఈ వార్తల్లో నిజమేంత ఉందో కానీ ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో వైరల్ అవుతుంది. ఈ వార్త కాస్త నందమూరి ఫ్యాన్స్ చెవుల్లో పడటంతో బాబాయ్ అబ్బాయిలు కలిసిపోయే టైం వచ్చేసిందని ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇకపోతే బాలయ్య 109 సినిమాలో నటిస్తున్నాడు.. అటు ఎన్టీఆర్ కూడా మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు..