Chiranjeevi Konidela: ‘ఇంద్ర’ టీంకి ‘చిరు’ సత్కారం!

Chiranjeevi Konidela: మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో దాదాపు అన్ని జోనర్స్ లో కూడా సినిమాలు చేశారు. ఇంద్ర సినిమా వరకు మెగాస్టార్ చిరంజీవి ఒక ఫ్యాక్షన్ సినిమా కూడా చేయలేదు. ఆ తరుణంలో వైజయంతి బ్యానర్స్ పై బి.గోపాల్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా చేశారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఇంద్ర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటివరకు వచ్చిన ఫ్యాక్షన్ సినిమాలన్నిటినీ మించి ఇంద్ర సినిమా ఉంటుంది. ఇంద్ర సినిమాలో ప్రతి ఎలిమెంట్ అద్భుతంగా వర్కౌట్ అయింది.

ఈ సినిమాకి చిన్ని కృష్ణ అందించిన కథ, మణిశర్మ అందించిన మ్యూజిక్, పరుచూరి గోపాలకృష్ణ అందించిన డైలాగ్స్ వీటన్నిటిని మించి బిగోపాల్ దర్శకత్వం ఇవన్నీ కూడా సినిమాను ఒక రేంజ్ లో నిలబెట్టాయి. అన్ని అంశాలు కూడా ఈ సినిమా కథకి సరిగ్గా కుదిరాయి. నిన్న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర సినిమాను రిలీజ్ చేశారు. ప్రస్తుతం మరోసారి 22 ఏళ్లు తర్వాత ఈ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.

Indra Re-Release

- Advertisement -

ఇది సినిమా ప్రస్తుతం చాలా సక్సెస్ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. ఇక సినిమా క్రియేట్ చేసిన సునామీని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా ప్రదర్శించబడుతున్నందుకు మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్ర యూనిట్ అంతటినీ పిలిచి సత్కరించారు. అయితే ఒక సినిమా రి రిలీజ్ అని కాకుండా రిలీజ్ కి ఎంత క్రౌడ్ ఉంటుందో అంతమంది ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు