Committe Kurrollu-Aay : మరో వారం రోజులు ఈ సినిమాలకు మంచి అడ్వాంటేజ్..

Committe Kurrollu-Aay : టాలీవుడ్ లో కల్కి2898AD సినిమా తర్వాత మరో పెద్ద సక్సెస్ ఫుల్ సినిమా రాలేదని చెప్పాలి. రీసెంట్ గా పంద్రాగస్టుకు రిలీజ్ అయిన బడా సినిమాలు కూడా ప్లాప్ టాక్ తెచ్చుకోగా, ఈ సమయంలో టాలీవుడ్ ని ఆదుకుంది చిన్న సినిమాలే అని చెప్పాలి. రెండు వారాల కింద రిలీజ్ అయిన కమిటీ కుర్రోళ్లు, అలాగే గత వారం రిలీజ్ అయిన ఆయ్ సినిమా (Committe Kurrollu-Aay). ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ కు ఊపిరి పోశాయి. థియేటర్లలో ఒక్క సరైన సినిమా లేక ఖాళీగా ఉన్న సమయంలో ఈ చిన్న సినిమాలు బయ్యర్లకు మంచి లాభాలు అందించాయని చెప్పాలి. పైగా విడుదలైన వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమాలు భారీ ప్రాఫిట్ ని సొంతం చేసుకుంటున్నాయి.

Committe Kurrollu-Aay movies showing strong hold

ఆదుకున్న చిన్న సినిమాలు…

అయితే పంద్రాగస్టులో పెద్ద సినిమాల ఊపు వల్ల ఈ సినిమాలని థియేటర్లలో పట్టించుకోరని అనుకున్నా, ఆ సినిమాలే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని వారాంతంలోనే థియేటర్లలోంచి తొలగిపోయే పరిస్థితి వచ్చింది. ఇక ఈ చిన్న సినిమాలకు మంచి ప్లస్ అయింది. ఇక ఈ వారం కూడా ఆశించిన సినిమాలేవీ థియేటర్లలో రాలేదు. చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా ఇంద్ర రీ రిలీజ్ మినహా, మిగతా సినిమాలేమి అంతగా రెస్పాన్స్ తెచ్చుకోవడం లేదు. కాబట్టి ఈ వారం కూడా ఈ చిన్న సినిమాలే ప్రేక్షకులకి మంచి ఆప్షన్ అయ్యాయి. ఇక ఈ రెండు సినిమాలు కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిన్న సినిమాలే కావడం విశేషం.

- Advertisement -

చిన్న సినిమాలకు మంచి అడ్వాంటేజ్..

ఇక ఈ వారం కూడా థియేటర్లలో సినిమాలు లేకపోవడంతో కమిటీ కుర్రోళ్లు, ఆయ్ సినిమాలకు ఈ వారం కూడా మంచి అడ్వాంటేజ్ అయిందని చెప్పాలి. ఇక కమిటీ కుర్రోళ్ళు ఇప్పటికే 15 కోట్ల వసూళ్లు అందుకోగా, ఆయ్ సినిమా 10 కోట్ల మార్క్ దాటింది. ఈ వారంలో కూడా మంచి హోల్డ్ చూపిస్తే మరో నాలుగైదు కోట్ల కలెక్షన్లు పిండుకునే ఛాన్స్ ఉంది. ఇక వచ్చే వారం నాని సరిపోదా శనివారం సినిమా ఉండడంతో అప్పటివరకు ఈ సినిమాల సందడి ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు