SSMB -29: మహేష్ – రాజమౌళి కాంబో.. టైటిల్ రివీల్ చేసిన జక్కన్న..!

SSMB-29.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ రాజమౌళి (Rajamouli )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . శాంతి నివాసం అనే సీరియల్ ఎపిసోడ్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి సినిమాతో డైరెక్టర్గా అడుగుపెట్టి , మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఎంతోమంది హీరోలతో సినిమాలు చేసి అన్నీ కూడా సూపర్ హిట్ విజయాలే తన ఖాతాలో వేసుకున్నారు రాజమౌళి.

SSMB-29: Mahesh - Rajamouli Combo.. Title Revealed by Jakkanna..!
SSMB-29: Mahesh – Rajamouli Combo.. Title Revealed by Jakkanna..!

కమెడియన్ హీరోగా మార్చిన ఘనత..

అంతేకాదు కమెడియన్ ను కూడా హీరోగా మార్చిన ఘనత రాజమౌళికే సొంతం రాజమౌళి, సునీల్ ను హీరోగా పెట్టి మర్యాదరామన్న సినిమా తీసి మంచి విజయాన్ని అందించారు. హీరో ఎవరైనా పర్లేదు కథ బాగుండి వారిలోని నటనను వెలికి తీయడమే తన టాలెంట్ అంటూ మరొకసారి నిరూపించారు రాజమౌళి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ఒక్కసారిగా ఎల్లలు దాటించారు.ఈ సినిమాతో తెలుగు సినిమా దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక రెండేళ్ల క్రితం రాజమౌళి ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో కలిసి ఆర్ఆర్ఆర్ అంటూ మల్టీ స్టార్రర్ మూవీ ని తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాదు తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు అందించింది. అంతేకాదు ఈ సినిమా ఆస్కార్ అవార్డులను కూడా సొంతం చేసుకోవడంతో రాజమౌళి పేరు ప్రపంచ స్థాయిగా మారుమ్రోగింది. ప్రపంచ ప్రఖ్యాత డైరెక్టర్లు కూడా రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు అంటే ఆయన డైరెక్షన్ ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఎస్ ఎస్ ఎం బి -29 టైటిల్ రివీల్..

ముఖ్యంగా చేసింది కొన్ని సినిమాలే అయినా ప్రతి సినిమాలో కూడా తన మార్క్ చూపించి రికార్డు క్రియేట్ చేశారు రాజమౌళి. ఇక ప్రస్తుతం మహేష్ బాబు (Mahesh Babu) తో తన చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఎస్ ఎస్ ఎం బి -29 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఆఫ్రికన్ అడ్వెంచర్ నేపథ్యంలో రాబోతున్నట్లు ఈ సినిమా రచయిత డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇదిలా ఉండగా తెలుగు సినిమా పరిశ్రమకే పరిమితమైన సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -

గరుడ టైటిల్ రివీల్..

ఈ సినిమా కోసం అటు రాజమౌళి ఇటు మహేష్ బాబు భారీ స్థాయిలో కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టైటిల్ ని రిలీజ్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే ఇటీవల ఒక ఈవెంట్లో పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ.. ఎస్ ఎస్ ఎం బి 29 మూవీకి గరుడ అనే టైటిల్ ఆలోచనలో ఉంది. ప్రస్తుతం నా మైండ్ లో కూడా ఇదే టైటిల్ తిరుగుతోంది ఇంతకుమించి ఇంకా ఏమి నేను మీతో రివీల్ చేయలేను అంటూ తెలిపారు రాజమౌళి. ఇక ఈ విషయం తెలిసే అభిమానులు ఈ సినిమాకి టైటిల్ గరుడ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు