Thangalaan : తెలుగు సినిమాలు తీసేసి మరీ, తమిళ సినిమాను భర్తీ చేస్తున్న బయ్యర్లు..

Thangalaan : కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ సినిమా ఆగష్టు 15న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ యాక్షన్ ఫాంటసీ డ్రామా థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకోగా, విక్రమ్ (Chiyaan vikram) నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక టాలీవుడ్ లో కూడా డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ కన్నా ఈ తంగలాన్ బెటర్ అన్న టాక్ తెచ్చుకోవడంతో మంచి కలెక్షన్లు నమోదవుతున్నాయి. అయితే ఫస్ట్ డే మిగతా చిత్రాల పోటీ వల్ల డీసెంట్ స్టార్ట్ ని సొంతం చేసుకున్న తంగలాన్ ఆ తర్వాత కలెక్షన్లు బాగా వస్తాయని అనుకున్నా ఊహించినంత రావడం లేదు.

Theaters grown for Thangalaan movie in Telugu states

తొలివారం యావరేజ్ వసూళ్లు..

అయితే తంగలాన్ (Thangalaan) సినిమా తొలిరోజు అదరగొట్టగా, రెండో రోజు స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తుందని అనుకున్నారు అభిమానులు. కానీ అలా జరగలేదు. తెలుగు రాష్ట్రాల్లో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాల హడావిడి వల్ల, ఈ సినిమాని బిసి సెంటర్లలో అంతగా పట్టించుకోలేదు ఆడియన్స్. అయితే తొలి వారం తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ వసూళ్లు అందుకున్న తంగలాన్ రెండో వారంతో థియేటర్లలో దాదాపుగా తీసేస్తారని అనుకున్నారు నెటిజన్లు. కానీ అనూహ్యంగా తంగలాన్ కి రెండో వారం థియేటర్లు పెంచడం జరిగింది.

- Advertisement -

తెలుగు సినిమాలు తీసేసి తంగలాన్ వేసుకున్నారు..

అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ వారంలో పెద్దగా సినిమాలు రిలీజ్ లేకపోవడం వల్ల తంగలాన్ ని రెండో వారం కూడా కంటిన్యూ చేస్తుండగా, రెండో వారం థియేటర్లు తగ్గుతాయనుకుంటే, తొలివారం ని మించి రెండోవారం లో థియేటర్లు పెంచారు మేకర్స్. ఫస్ట్ వీక్ లో తెలుగు రాష్ట్రాల్లో 250 థియేటర్లో రిలీజ్ కాగా, రెండో వారం ఏకంగా 390 థియేటర్లకు పెరిగింది. ఇక డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలని తీసేసి మరీ ఈ సినిమాని భర్తీ చేసారు బయ్యర్లు. ఇక ఈ వారం పెద్దగా సినిమాలు ఏవి రిలీజ్ కాకపోవడంతో తంగలాన్ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి. ఇక తెలుగులో తంగలాన్ సినిమా 3.50 కోట్ల షేర్ వసూలు చేయగా, 6 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో మూడు కోట్లయినా రాబట్టాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు