Kalki 2898 AD : అర్షద్ కి బొమ్మలు పంపిస్తా… ప్రభాస్ ను ట్రోల్ చేసిన బాలీవుడ్ నటుడికి నాగి కౌంటర్

Kalki 2898 AD : బాక్స్ ఆఫీస్ వద్ద ప్రస్తుతం ప్రభంజనం సృష్టిస్తున్న సినిమా కల్కి. ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయి ఏంటి అని మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెలియజేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రభాస్ ఈ సినిమాలో భైరవ పాత్రలో కనిపించాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కెరియర్ లో సరైన హిట్ సినిమా పడలేదు అనుకున్న తరుణంలో ఈ సినిమా మళ్లీ 1000 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి తెలుగు సినిమాను వేరే లెవెల్ కి తీసుకెళ్లింది. ఈ సినిమా మొదటి రోజు నుంచి విపరీతమైన పాజిటివ్ కాకుండా సాధించింది. అలానే అక్కడక్కడ నెగిటివ్ టాక్ కూడా వినిపించింది అయినా కానీ పెద్దగా సినిమాపై ఎఫెక్ట్ ఏమీ పడలేదు.

ఈ సినిమా తర్వాత చాలామంది సోషల్ మీడియా వేదికగా మైథాలజీ గురించి, వేదాలు గురించి డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. ఇది చాలా గొప్ప పరిణామం అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ మించి అమితాబచ్చన్ నటించారు అని అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రభాస్ కూడా పలు సందర్భాల్లో ఒప్పుకున్నారు. అయితే ప్రభాస్ కొంతమంది ట్రోల్ కూడా చేయటం మొదలుపెట్టారు. ప్రతి హీరోను ట్రోల్ చేయడమనేది ఎక్కడో కామన్ గా జరుగుతూనే ఉంటుంది.

Kalki 2898 AD

- Advertisement -

ఇకపోతే కల్కి సినిమా గురించి ప్రస్తావిస్తూ అర్షద్ వార్షి ప్రభాస్ ఈ సినిమాలో నాకు ఒక జోకర్ లా కనిపించాడు అంటూ కామెంట్స్ చేశాడు దీనితో అర్షద్ ను చాలామంది విపరీతంగా ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. అయితే తాజాగా ఒక నెటిజన్ కల్కి సినిమా ఒక వీడియోను పోస్ట్ చేసి బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఈ వీడియో కంటే చిన్నదే అన్నట్లు పోస్ట్ చేశాడు. దానికి నాగ్ అశ్విన్ స్పందిస్తూ నోమోర్ నార్త్ , నోమోర్ సౌత్ అంటూ యునైటెడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటూ చెప్పవచ్చాడు. హర్షద్ షాబ్ మంచిగా మాట్లాడాల్సి ఉండాల్సింది. కానీ పర్లేదు బుజ్జి బొమ్మలను వాళ్ల పిల్లలకి పంపిద్దాం అంటూ తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చాడు నాగి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు