Nagarjuna : నాగార్జునకు షాకిచ్చిన హైడ్రా అధికారులు.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత..

Nagarjuna : టాలీవుడ్ కింగ్ నాగార్జునకు గట్టి షాక్ ఇచ్చారు హైడ్రా అధికారులు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ ను పూర్తిగా కూల్చేయబోతున్నారు. మాదాపూర్ ప్రాంతంలో ఉన్న కింగ్ నాగార్జున కన్వెన్షన్ హాల్ ని కూల్చివేయడానికి GHMC అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కింగ్ నాగార్జునకు అన్నపూర్ణ స్టూడియోతో పాటు పలు రకాల పెద్ద పెద్ద బిజినెస్ లు ఉన్నాయని తెలిసిందే. అందులో ఎన్ కన్వెన్షన్ హాల్ ఒకటి. ఈ కన్వెన్షన్ హాల్ లో పలు ఈవెంట్లు, ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు దీన్ని కూల్చివేయడానికే GHMC అధికారులు సిద్ధమయ్యారు. అయితే నాగార్జునకు చెందిన ఈ ‘ఎన్ కన్వెన్షన్’ హాల్ ను అక్రమంగా నిర్మించారనే ఆరోపణలు నాగార్జునపై ఉన్నాయి.

GHMC, Hydra officials demolishing Nagarjuna's N convntion hall

ఎన్ కన్వెన్షన్ ని పూర్తిగా కూల్చేస్తున్నారు..

మాదాపూర్ లో తుమ్మిడికుంట చెరువు స్థలంలో ఈ కన్వెన్షన్ హాల్ (N Convention Hall) ని నిర్మించారని నాగార్జునపై ఆరోపణలు ఉన్నాయి. కాగా హైదరాబాద్‌లో దాదాపు 40 ఏళ్లుగా జరిగిన చెరువుల ఆక్రమణలపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నివేదికను విడుదల చేయగా, దాంట్లో నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూడా అక్రమంగా కట్టబడిందని డిసైడ్ చేశారు. దీనిపై చర్యలు తీసుకుంటూ, హైదరాబాద్ కమిషనర్ ఎవి రంగనాథన్ కూల్చివేయమని ఆర్డర్ వేశారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) కి అందిన సమాచారం ఆధారంగా ఆక్రమణ చేసిన కట్టడాలన్నీ కూల్చివేస్తున్నారు అధికారులు.

- Advertisement -

ఇక తుమ్మిడికుంట చెరువు స్థలంలో నిర్మించిన నాగార్జున (Nagarjuna) ఎన్ కన్వెన్షన్ హాల్ ను పదేళ్ల కిందటే అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం అక్రమ కట్టడాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టినా కన్వెన్షన్‌ హాల్‌ మాత్రం పెండింగ్ లో ఉండిపోయిందట. ఇప్పుడు మాదాపూర్ ప్రాంతంలో అక్రమంగా ఉన్న మూడున్నర ఎకరాల ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూల్చివేస్తూ, భూమిని స్వాధీనం చేసుకోనున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో ఆ ఏరియాలో పోలీసులు భారీగా మోహరించారు. ఏది ఏమైనా ఇలాంటి కొన్ని భూ వివాదాలు నాగార్జున పై గతం నుండి ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు