Director Shailesh Kolanu: దర్శకుడు శైలేష్ కొలను కి అస్వస్ధత

Director Shailesh Kolanu: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో శైలేష్ కోలను ఒకరు. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు శైలేష్. విశ్వక్సేన్ నటించిన హిట్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శైలేష్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత చేసిన హిట్ 2 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ హీరోగా సైంధవ అనే సినిమాతో సంక్రాంతి బరిలో సిద్ధమయ్యాడు శైలేష్. ఈ సినిమా ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది.

ఇకపోతే ప్రస్తుతం హిట్ 3 అనే సినిమాను చేయనున్నాడు శైలేష్. ఈ సినిమాలో నాని హీరోగా కనిపించబోతున్నాడు. ఇకపోతే సినీమాటిక్ యూనివర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాటిక్ యూనివర్స్ తెలుగు దర్శకులు కూడా మొదలుపెట్టారు. ఇక అలానే శైలేష్ కొలను కూడా ఒక ప్రత్యేకమైన సినీమెటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశాడు.

HIT

- Advertisement -

ఇక ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ కి అస్వస్థత ఉన్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా డెంగ్యూ ఫీవర్ తో శైలేష్ బాధపడుతున్నట్లు సమాచారం వినిపిస్తోంది. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇకపోతే ఆరోగ్యం మొత్తం సరైన తర్వాత హిట్ త్రీ పనులు ప్రారంభించనున్నాడు శైలేష్. మొదటి రెండు హిట్ సినిమాలు మంచి ఘనవిజయం సాధించడంతో హిట్ 3 పై కూడా చాలా మందికి క్యూరియాసిటీ మొదలైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు