Vadivelu: పరువు నష్టం దావా వేసిన కమెడియన్.. అసలు ఏమైందంటే..?

Vadivelu.. కోలీవుడ్ ఇండస్ట్రీలో తన కామెడీతో ప్రేక్షకులను బాగా అలరించిన కమెడియన్ వడివేలు (Vadivelu )గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ కమెడియన్ సినిమాలలో కంటే తరచూ ఎక్కువగా వివాదాలలోనే నిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మరొకసారి తన సహ నటుడు పైన పరువు నష్టం దాఖలు చేసి మరొకసారి చర్చనీయాంశంగా మారారు. సోషల్ మీడియాలో తన పరువు పోయేలా కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ, నటుడు సింగముత్తు (Singamutthu)నుంచి తనకు రూ .5కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అంటూ ఇటీవల మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వడివేలు. కానీ ఆ తర్వాత సింగముత్తు ఇక మీదట తన మీద ఎలాంటి పరువు నష్టం కలిగించే విధంగా ప్రకటనలు చేయకుండా శాశ్వత ఉత్తర్వులను జారీ చేయాలి అంటూ వడివేలు సైతం తన పిటీషన్ లో హైకోర్టుని ఆశ్రయించారు.

Vadivelu: The comedian filed a defamation suit.. What actually happened..?
Vadivelu: The comedian filed a defamation suit.. What actually happened..?

వడివేలు పై సింగముత్తు అనుచిత వ్యాఖ్యలు..

అయితే ఈ విషయం పైన జస్టిస్ RMT టీకా రాయన్ ఈ కేసును సైతం విచారిస్తూ.. ఈ విచారణకు సైతం సింగముత్తు రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి 16 ఫిబ్రవరి 11వ తేదీలలో ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా వడివేలు ఆ విషయాలను చాలా సీరియస్ గా తీసుకున్నారని తెలియజేశారు. సింగముత్తు చాలాసార్లు తనమీద అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని , తప్పుడు సమాచారాన్ని కూడా చెప్పారని ఈ పిటీషన్ లో తెలియజేశారు.

నష్టపరిహారం చెల్లించాలంటున్న వడివేలు..

ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మార్చి 19న సింగముత్తు తో సహా ఆ యూట్యూబ్ చానల్స్ పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అందరూ క్షమాపణలు చెప్పాలని, ఆ వ్యాఖ్యలను కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ కూడా చేశారు వడివేలు. అయితే దీనికి సింగముత్తు మాట్లాడుతూ.. నాకు వాక్ స్వాతంత్రం హక్కు ఉంది. రాజ్యాంగం ప్రకారం ఆ స్వాతంత్రాన్ని నేను కాపాడుకుంటాను అంటూ కామెంట్లు చేయగా.. ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. వడివేలు దీనికి స్పందిస్తూ.. ఇది గాయానికి ఉప్పు లాంటిది. పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు నన్ను తీవ్ర మానసిక వేదనకు గురిచేసాయి. అతడి తప్పుడు వ్యాఖ్యలు మరింత బాధ కలిగించాయి. తప్పకుండా సింగముత్తు నాకు నష్టపరిహారం ఇవ్వాలి అని, ఆదేశించకపోతే అతడు ఇంకా అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు అంటూ తెలిపారు వడివేలు.

- Advertisement -

సింగముత్తు వల్ల పరువు మొత్తం పోయింది..

వడివేలు తనపై సింగముత్తు చేస్తున్న హేళన మాటలను ఇంకొకసారి మాట్లాడకుండా అడ్డుకట్ట వేయాలని కోరుకుంటున్నారు. ఇకపోతే వడివేలు సినిమాలు ఇండియన్ మార్కెట్లోనే కాదు అంతర్జాతీయ భాషల్లో కూడా డబ్ అయి, ఆయనకు మంచి పాపులారిటీ తీసుకొచ్చాయి. ముఖ్యంగా సింగముత్తు చేసిన పరువు నష్టం కలిగించే ప్రకటనలు ప్రజల్లో తన ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతిస్తాయని వడివేలు వాదించారు. మరి దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మొత్తానికైతే వడివేలు సింగముత్తు తనపై చేస్తున్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, తనకు పరువు నష్టం కలిగించినందుకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా కోరారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు