Spirit : ప్రభాస్ – వంగ ‘స్పిరిట్’ లేటెస్ట్ అప్డేట్.. సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడే?

Spirit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. లాస్ట్ ఇయర్ ఆది పురుష్ తో డిజాస్టర్ అందుకున్న రెబల్ స్టార్ ఆ వెంటనే సలార్ తో వచ్చి ఊర మాస్ కం బ్యాక్ ఇచ్చాడు. ఇక ఈ ఇయర్ కల్కి2898AD సినిమాతో వచ్చి ఏకంగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి తన సత్తా చాటాడు. ఇక ఆ తర్వాత కూడా ఆలస్యం చేయకుండా వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. గ్యాప్ లేకుండా ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటూ ప్రభాస్ రచ్చ రచ్చ చేస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో అందరికంటే ఎక్కువ బిజీగా ఉంది ప్రభాస్ (Prabhas) మాత్రమే అని చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

Prabhas - Sandeep Reddy Vanga's 'Spirit' Latest Update

ప్రభాస్ – వంగ ప్రాజెక్ట్ పై అదిరిపోయే అప్డేట్..

ప్రస్తుతం ప్రభాస్ మారుతి తో రాజా సాబ్ (Rajasaab) సినిమా, అలాగే హను రాఘవపూడి ప్రాజెక్ట్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఒకేసారి ఈ రెండు సినిమాల షూటింగ్ లో పాల్గొంటూ ఫుల్ బిజీ అయ్యాడు. ఇదిలా ఉండగా ప్రభాస్ సందీప్ రెడ్డి (SandeepReddy Vanga) ప్రాజెక్ట్ పై క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబోలో “స్పిరిట్” అనే భారీ పాన్ వరల్డ్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయి చాలా రోజులైనా, ఇద్దరూ తమ ఇతర ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండడం వల్ల ఇంకా పట్టాలెక్కలేదు. కాగా ఈ సినిమా గురించి తాజా న్యూస్ వైరల్ ఆవుతుంది. ప్రభాస్ ‘స్పిరిట్’ (Spirit) సినిమాను పాన్ వరల్డ్ లెవెల్లో సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తుండగా, ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ ఇయర్ లోనే ఉంటుందని, కానీ షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది “జనవరి” నుంచే మొదలు పెట్టేందుకు సందీప్ వంగ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

ఈ రెండూ పూర్తయ్యాకే మొదలు..

ఇక ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ చేస్తుండగా, ఆ షూటింగ్ ఫినిషింగ్ దశలో ఉంది. ఇక హను – ప్రభాస్ సినిమా కూడా ఈ ఇయర్ లో పూర్తి చేసేస్తారని సమాచారం. ఈ రెండు ఫినిష్ అయ్యాక ప్రభాస్ స్పిరిట్ మొదలు పెడతాడు. ఇక స్పిరిట్ షూట్ చేస్తూనే, దీంతో పాటు ప్రశాంత్ నీల్ తో శౌర్యంగ పర్వం, లేదా కల్కి పార్ట్2 ని మొదలుపెట్టే అవకాశం ఉంది. మొత్తానికి ప్రభాస్ గ్యాప్ లేకుండా నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడని తెలుస్తుంది. అయితే స్పిరిట్ ప్రేక్షకుల ముందుకు వచ్చేది మాత్రం 2026 లో అని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు