Suriya: ప్రైవేట్ జెట్ కొన్న సూర్య.. ఖరీదు తెలిస్తే షాక్..!

Suriya.. కోలీవుడ్ స్టార్ హీరోగా పేరుపొందిన హీరో సూర్య (Suriya,) ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కంగువ సినిమాలో నటిస్తున్న ఈయన..ఇటీవలే కంగువ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ కూడా విడుదల కాగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తో మరొక ప్రాజెక్టును కూడా మొదలుపెట్టారు. ఇదంతా ఇలా ఉండగా గత కొద్దిరోజులుగా కోలీవుడ్ మీడియాలో సూర్య గురించి ఒక న్యూస్ అయితే హల్చల్ చేస్తోంది. అదేమిటంటే హీరో సూర్య సొంతంగా ఒక ప్రైవేట్ జెట్ ని కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Suriya: Surya bought a private jet.. Shocked to know the cost..!
Suriya: Surya bought a private jet.. Shocked to know the cost..!

రూ.120 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసిన సూర్య..

చాలా విలాసవంతంగా ఉండేటు వంటి ఒక ప్రైవేట్ జెట్ ను , తనకు అనుకూలంగా ఉండేటట్టు ప్రత్యేకంగా డిజైన్ చేయించారట. ఇక తనకు నచ్చిన సౌకర్యాలన్నీ ఉన్న డస్సాల్డ్ పాల్కర్ 2000 ప్రైవేట్ జెట్ ని సూర్య కొనుగోలు చేసినట్లు ఒక న్యూస్ అయితే హల్చల్ చేస్తోంది. అంతేకాదు ఈ ప్రైవేట్ జెట్ ధర సుమారుగా120 కోట్ల రూపాయలు ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇందులో కొన్ని అత్యాధునిక, సాంకేతిక భద్రత సౌకర్యాలు కూడా ఇందులో చాలానే ఉన్నాయట. అయితే తమిళ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఇలాంటి ప్రైవేట్ జెట్ ఏ నటుడుకి కూడా లేదట. ఒకవేళ ఇది నిజమైతే కేవలం సూర్య మాత్రమే ఈ ప్రైవేట్ జెట్ కలిగి ఉన్న నటుడుగా పేరు సంపాదిస్తారు.

కొనుగోలుపై సూర్య టీం క్లారిటీ..

ఇదిలా ఉండగా మరోవైపు ఈ విషయం మీద సూర్య సన్నిహితులు సైతం ఇందులో ఎలాంటి నిజము లేదని సూర్య ఎలాంటి ప్రైవేట్ జెట్ కూడా కొనుగోలు చేయలేదని ధ్రువీకరించారు. కేవలం సూర్య తన తదుపరి ప్రాజెక్టు మీద సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారని తెలియజేశారు. సూర్య నటించిన కంగువ సినిమా అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇక అదే రోజున రజనీకాంత్ నటించిన వెట్టయాన్ సినిమా కూడా రిలీజ్ కాబోతున్నదట. దీంతో ఈసారి కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద సూర్య వర్సెస్ రజనీకాంత్ అన్నట్టుగా పోటీ ఉండబోతోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

కంగువ సినిమా..

కంగువ చిత్ర విషయానికి వస్తే.. ఈ సినిమాలో సూర్య కి జోడిగా ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, బాబి డియోల్ విలన్ గా నటిస్తున్నారు. అలాగే యోగి బాబు , జగపతి బాబు తదితర నటీనటులు సైతం ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. సూర్య కూడా ఇందులో విభిన్నమైన గెటప్పులలో కనిపించబోతున్నట్లు సమాచారం.

సూర్య వ్యక్తిగత జీవితం..

ఇక సూర్య వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే ప్రముఖ హీరోయిన్ జ్యోతికను(JYOTHIKA) ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు ఈమెను పెళ్లి చేసుకోవడానికి సూర్య కుటుంబ సభ్యులు అంగీకరించకపోయినా.. పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకుంది ఈ జంట. ప్రస్తుతం సూర్య దంపతులు ముంబైలో పిల్లల చదువుల నిమిత్తం అక్కడే సెటిల్ అయినట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు