Akkineni Nagarjuna: N – కన్వెన్షన్ కూల్చివేత.. ప్రభుత్వంపై నాగ్ ఫైర్… కోర్టుకు వెళ్తామని ప్రకటన

Akkineni Nagarjuna.. తాజాగా అక్కినేని నాగార్జున (Nagarjuna) కు షాక్ ఇస్తూ హైదరాబాదులోని మాదాపూర్ లో ఉన్న ఎన్.కన్వెన్షన్ (N – Convention)ను హైడ్రా ప్రత్యేక బృందం సమక్షంలో కూల్చివేశారు. హైటెక్ సిటీ జంక్షన్ లో వేలకోట్ల విలువైన పది ఎకరాల విస్తీర్ణంలో హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మించారు. ఇందులో వందలు , వేల కోట్ల డబ్బున్న వాళ్ల ఫంక్షన్స్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. భారీ ఎత్తున సెట్టింగ్స్ వేస్తూ విలాసవంతమైన వేడుకలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఈ ఫంక్షన్ హాల్.

Akkineni Nagarjuna: N - demolition of convention.. nag fire on govt.. announcement to go to court
Akkineni Nagarjuna: N – demolition of convention.. nag fire on govt.. announcement to go to court

N- కన్వెన్షన్ అక్రమంగా కూల్చివేత..

అయితే ఇప్పుడు ఈ హైడ్రా( హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) విశ్వరూపం చూపిస్తూ.. ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసింది నిజానికి 2015 నుంచి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆక్రమణలో ఉన్న తుమ్మిడికుంట చెరువును రక్షించింది. ఇకపోతే నాగార్జున కొనుగోలు చేసిన పది ఎకరాలలో తుమ్మిడి కుంట చెరువు భూమి మూడున్నర ఎకరాలు కబ్జా చేశారని వార్తలు తెరపైకి వచ్చాయి. ఇందులో ఎకరా 12 సెంట్లు ఫుల్ ట్యాంకు లెవెల్, మరో రెండు ఎకరాలు బఫర్ జోన్ చెరువు భూమి అన్నట్లు సమాచారం. ఇక ఎన్ కన్వెన్షన్ ను తుమ్మిడికుంట చెరువు నీటిమట్టానికి కేవలం 25 మీటర్ల దూరంలో మాత్రమే కట్టారు. నిబంధనల ప్రకారం 30 మీటర్ల ఎత్తులో ఉండాలి కానీ అలా చేయలేదు. ఇక అందుకే ఆక్రమంగా స్థలాలు కబ్జా చేసి నిర్మించారు అంటూ ఎన్ కన్వెన్షన్ కూల్చివేసింది హైడ్రా.

అక్కినేని నాగార్జున ఫైర్.

అయితే తాజాగా ఎన్ – కన్వెన్షన్ కూల్చివేత పై అక్కినేని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టులో తేల్చుకుంటానంటూ ఒక నోట్ విడుదల చేశారు.ఈ మేరకు.. స్టే ఆర్డర్ , కోర్ట్ కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన కూల్చివేతలు చేపట్టడం చాలా బాధాకరం. మా పరువు ప్రతిష్టను కాపాడడం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం, అలాగే చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎప్పుడు ఎటువంటి చర్యలు చేపట్టలేదు అని తెలపడానికే ఈ ప్రకటన జారీ చేస్తున్నాను అంటూ తెలిపారు నాగార్జున.

- Advertisement -

న్యాయస్థానంలో తేల్చుకుంటాం..

ఈ భూమి పట్టా భూమి.. ఒక అంగుళం కూడా ఆక్రమణకు గురి కాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం ఇది. గతంలో కూల్చివేత కోసం అక్రమ నోటీస్ పై స్టే కూడా మంజూరు చేయబడింది. కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం ఎన్ – కన్వెన్షన్ ను కూల్చి వేయడానికి ముందు కూడా మాకు ఎటువంటి నోటీసులు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఎలా చేస్తారు? చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే ఖచ్చితంగా కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని, కానీ తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని, ప్రజలకు మాపై తప్పుడు అభిప్రాయం కలిగేలా తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. అందుకే ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధమైన చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము. మాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ నాగార్జున ఒక నోట్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ నోట్ నెట్టింట వైరల్ అవుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు